iDreamPost
android-app
ios-app

ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు చెబుతున్న వైఎస్సార్‌ అభిమానులు..!

ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు చెబుతున్న వైఎస్సార్‌ అభిమానులు..!

ఆంధ్రజ్యోతి పత్రికకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి (వైఎస్సార్‌) అభిమానులు ధన్యావాదాలు చెబుతున్నారు. ఇదేంటి.. వైఎస్సార్‌పై ఇప్పటికీ విషయం గక్కే ఆంధ్రజ్యోతికి ఆయన అభిమానులు ఎందుకు ధన్యావాదాలు చెబుతారు అనే సందేహం రావొచ్చు. కానీ ఇది నిజం. దీనికి ఓ కారణం ఉంది. పోలవరం ప్రాజెక్టు వద్ద వైఎస్సార్‌ 100 విగ్రహం ఏర్పాటు చెయబోతునట్టు ప్రభుత్వం ఆలోచన బయటకు వచ్చిందంటే.. దానికి ఏకైక కారణం ఆంధ్రజ్యోతి పత్రిక పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రాసిన కథనాలే అని వైఎస్సార్‌ అభిమానులు చెబుతున్నారు.

ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి కథనాలు రాసి అర్ధంలేని విమర్శలు చేయడం మూలానే .. ప్రభుత్వం ప్రతిస్పందిస్తూ ప్రాజెక్టు ఏత్తు తగ్గించే అవకాశమే లేదని , ప్రాజెక్టు తమ హయాంలో అనుకున్న ఏత్తునే, అనుకున్న సమయంలోనే నిర్మించి అక్కడే వైయస్సార్ గారి 100 అడుగుల విగ్రం ఏర్పాటు చేసి తీరుతాం అని తమ ఆలోచనను బయటపెట్టింది. దీంతో ప్రాజెక్టు దగ్గర 100 అడుగుల వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమైంది. ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన కథనాలను పట్టుకుని నానా యాగీ చేసిన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాకు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఈ ప్రకటనతో చెక్‌ పెట్టారు.

ఏళ్ల తరబడి ప్రతిపాదనల దశలోను ఉన్న పోలవరం ప్రాజెక్టుకు ఓ రూపు తెచ్చిన నేత వైఎస్సార్‌. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అంత్యం క్లిష్ట, సున్నితమైన అటవీ. పర్యావరణ అనుమతులు కూడా సంపాదించారు. నిర్మాణంలో అన్నిటి కంటే క్లిష్టమైన కాలువల కోసం భూ సేకరణ, తవ్వకం, లైనింగ్‌ దాదాపు పూర్తి చేశారు. ఆయన మరణంతో ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగింది. నాడు వైఎస్సార్‌ తవ్వించిన కుడి కాలువపైనే పట్టిసీమ ఎత్తిపోతల స్కీం పెట్టి.. అదేదో అద్భుతమైన ప్రాజెక్టు అంటూ చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకుంది. అదే కుడి, ఎడమ కాలువలు వైఎస్సార్‌ తవ్వించకపోతే.. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు అవకాశమే లేకుండాపోయేది.

పోలవరం ప్రాజెక్టుకు ప్రాణం పోసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ ఏర్పాటు చేస్తారనడంలో సందేహం లేదు. అయితే ఆ ప్రకటన ఇంత తొందరగా.. ఏర్పాటు చేస్తామని మంత్రి అనిల్‌కుమార్‌ ప్రకటించారంటే.. దానికి ప్రధాన కారణం ఆంధ్రజ్యోతి పత్రికే. అందుకే వైఎస్సార్‌ అభిమానులు ఈ క్రెడిట్‌ అంతా ఆంధ్రజ్యోతి పత్రికకు ఇస్తున్నారు.