iDreamPost
android-app
ios-app

వైఎస్‌ షర్మిల పార్టీ నమోదు

వైఎస్‌ షర్మిల పార్టీ నమోదు

తెలంగాణ రాజకీయాల్లో చురుకుగా ఉంటున్న దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె… వైఎస్‌ షర్మిల తన పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం రావాల్సిన అవసరం ఉందంటూ ప్రకటించిన షర్మిల.. తాను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ఖమ్మం నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రకటించారు. పార్టీ పేరు, విధివిధానాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే తన పార్టీ పేరును ఖరారు చేసిన ఆమె.. దాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్‌ చేశారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌ టీపీ)గా వైఎస్‌ షర్మిల పార్టీ పేరు రిజిష్టర్‌ అయింది. షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్‌ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.