iDreamPost
android-app
ios-app

వైసీపీలో నూతనోత్సాహం.. జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్లను ప్రకటించిన జగన్‌

వైసీపీలో నూతనోత్సాహం.. జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్లను  ప్రకటించిన జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మెరుపువేగంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో.. అందుకు అనుగుణంగా పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం జగన్‌ నడుంబిగించారు. ఈ నెల 11వ తేదీన నూతన కేబినెట్‌ను ఏర్పాటు చేసిన జగన్‌.. వారం రోజుల్లోనే వరుసగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు జిల్లాలకు ఇంఛార్జి మంత్రులను నియమించిన సీఎం జగన్‌.. ఆ వెంటనే పార్టీ జిల్లా అధ్యక్షులను, రీజనల్‌ కో ఆర్డినేటర్లను ప్రకటించారు.

జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులు..

1. చిత్తూరు – కేఆర్‌కే భరత్‌

2. అనంతపురం – కాపు రామచంద్రారెడ్డి

3. శ్రీ సత్యసాయి – ఎం. శంకర నారాయణ

4. అన్నమయ్య – గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

5. కర్నూలు – వై. బాలనాగిరెడ్డి

6. నంద్యాల – కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

7. వైఎస్సార్‌ కడప – కె.సురేష్‌బాబు

8. తిరుపతి – చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

9. నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి

10. ప్రకాశం – బుర్రా మధుసూదన్‌యాదవ్‌

11. బాపట్ల – మోపిదేవి వెంకటరమణ

12. గుంటూరు – మేకతోటి సుచరిత

13. పల్నాడు – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

14. ఎన్‌.టి.ఆర్‌ జిల్లా – వెల్లంపల్లి శ్రీనివాసరావు

15. కృష్ణా – పేర్ని నాని

16. ఏలూరు – ఆళ్ల నాని

17. పశ్చిమ గోదావరి – చెరుకునాడ శ్రీరంగనాథరాజు

18. తూర్పుగోదావరి – జక్కంపూడి రాజా

19. కాకినాడ – కురసాల కన్నబాబు

20. కోనసీమ – పొన్నాడ సతీష్‌కుమార్‌

21. విశాఖ – ముత్తంశెట్టి శ్రీనివాసరావు

22. అనకాపల్లి – కరణం ధర్మశ్రీ

23. అల్లూరి సీతారామరాజు – కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ

24. పార్వతీపురం మన్యం – పాముల పుష్పశ్రీ వాణి

25. విజయనగరం – చిన్న శ్రీను

26. శ్రీకాకుళం – ధర్మాన కృష్ణదాస్‌

రీజనల్‌ కో ఆర్డినేటర్స్‌..

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు.

సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి – కర్నూలు, నంద్యాల జిల్లాలు.

అనిల్‌ కుమార్‌ యాదవ్‌ – వైఎస్సార్‌ కడప, తిరుపతి జిల్లాలు.

బాలినేని శ్రీనివాస రెడ్డి– ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాలు.

కొడాలి నాని – గుంటూరు, పల్నాడు జిల్లాలు.

మర్రి రాజశేఖర్‌ – ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు.

పి.వి. మిథున్‌ రెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌ – ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలు

వైవీ సుబ్బారెడ్డి – విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు

బొత్స సత్యనారాయణ – పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alKulisbetKulisbetMadridbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş