iDreamPost
android-app
ios-app

అసెంబ్లీ వద్ద పసుపు అలజడి

అసెంబ్లీ వద్ద పసుపు అలజడి

అసెంబ్లీ సమావేశాలు హీటెక్కుతున్నాయి.ప్రతిరోజూ నిరసనలు, ఆందోళనలు, వాకౌట్ లతో అసెంబ్లీ హోరెత్తుతోంది. బుధవారం పెరిగిన ఆర్టీసీ బస్ చార్జీలపై నిరసన తెలిపిన టీడీపీ ఎమ్మెల్యే లు,నాల్గవ రోజైన గురువారం 2430 జీఓను రద్దు చేయాలని అసెంబ్లీ వద్ద నిరసన తెలిపారు. తొలుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యం లో టీడీపీ ఎమ్మెల్యేలు 2430 జీఓ ను రద్దు చేసి, మీడియా కు వేసిన సంకెళ్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ కి ర్యాలీ గా వచ్చారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్దకు రాగానే సీఎం కాన్వాయ్ వస్తున్న కారణంగా కాసేపు ఆగాలని అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది టీడీపీ సభ్యులను బయటే ఆపేశారు. సీఎం కాన్వాయ్ రావడం ఆలస్యం కావడం తో, తమను లోపలికి అలో చేయాలంటూ పోలీసులతో ఘర్షణ పడుతూ…సెక్యూరిటీని నెట్టి వేస్తూ లోపలికి ప్రవేశించారు. అనంతరం అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం లో ములస్తంభమైన మీడియాపై ఆంక్షలు విధించి మీడియా సంకెళ్లు వేశారని అన్నారు. 2430 జీఓ అనైతికమని అన్నారు. ఈటీవి, టీవీ 5, ఏబీఎన్ ఛానెళ్ల పై ఆంక్షలు విధించి అసెంబ్లీ సమావేశాలకు అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ట్రై నిభందనలు తుంగలో తొక్కి కేబుల్ టీవీ లలో ఇస్టాను సారం ప్రసారాలు సాగిస్తున్నారని అన్నారు. ఫైబర్ గ్రిడ్ పై ఫైనే వేసినా ప్రభుత్వానికి బుద్దిరాలేదని ఆరోపించారు. ప్రభుత్వం పూర్తిగా భరితెగించి పాలన సాగిస్తోందని అన్నారు. సీఎం లో మార్పు రాకపోతే తాము న్యాయం కోసం కోర్టు తలుపులు తట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ఎంత బరితెగించదంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ మైనార్టీ విలేఖరిని ఫోన్ లో బెదిరించినా, చంపుతానని హెచ్చరించినా చర్యలు లేవని అన్నారు.నెల్లూరుకే చెందిన జమీన్ రైతును బెదిరించినట్లు తెలిసిందన్నారు. ఇక ప్రకాశం జిల్లాలో ఆమంచి విలేఖరి పై దాడిచేసినవిషయం తెలిసిందే అన్నారు. అయినా చర్యలు లేవని గుర్తు చేశారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం అందరిపై ఉందని ఈ సందర్భంగా అబ్రహం లింకన్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే వారు ఎవరైనా కాల గర్భంలో కలసి పోతారని జోస్యం చెప్పారు.2430 జీఓ ను రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని నేడు అసెంబ్లీలో అడ్జేర్న్ మోషన్ ఇచ్చామని తెలిపారు.

అనంతరం అసెంబ్లీలోకి ప్రవేశించిన టీడీపీ సభ్యులు సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ తో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కల్పించుకుని మాట్లాడారు. అధ్యక్షా ఈ చంద్రబాబు కు ఏమైంది…సభ మొదటి నుండి గొడవలకు దిగుతున్నారు…సభలోకి వచ్చిన వారు సమస్యను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కానీ ఇలా గొడవ పడటం సరికాదని అన్నారు. ప్రతి రోజు సభాపతి తో గొడవపడటం టీడీపీ సభ్యులకు సంప్రదాయంగా మారిపోయిందని, పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. అనంతరం టీడీపీ సభ్యులు మైక్ తీసుకునీ సమస్యను స్పీకర్ కు విన్నవిస్తూ సభను కొనసాగించారు.