iDreamPost
android-app
ios-app

ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో గళం పెంచుతున్న వైఎస్సార్సీపీ

  • Published Jul 20, 2021 | 1:21 PM Updated Updated Jul 20, 2021 | 1:21 PM
ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో గళం పెంచుతున్న వైఎస్సార్సీపీ

వైఎస్సార్సీపీ వ్యూహం మార్చింది. పార్లమెంట్ లో గళం విప్పుతోంది. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ వివిధ సందర్భాల్లో ప్రభుత్వాన్ని సమర్థించిన ఆపార్టీ ఎంపీలు ఈసారి మాత్రం కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచే కొంత పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. ఏకంగా రాజ్యసభను స్తంభింపజేస్తున్నారు. లోక్ సభలో పార్టీ వాణీ లో తీవ్రత పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ తీరు ఆసక్తిగా మారుతోంది.

కేంద్రంలో ఆశించినట్టుగా రాకుండా ఏకపక్షంగా ఫలితాలు రావడంతో వేచి చూడక తప్పదని ముఖ్యమంత్రిగా జగన్ తన తొలి ఢిల్లీ పర్యటనలో మీడియాతో అన్నారు. దానికి అనుగుణంగానే గడిచిన రెండేళ్లుగా ఓర్పుతో వ్యవహరించారు. కీలక బిల్లుల విషయంలో కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం పలుమార్లు విన్నవించారు. అయినప్పటికీ సానుకూల స్పందన రావడం లేదని వైఎస్సార్సీపీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా పోలవరం అంచనా వ్యయం పెంపుదల వంటి విషయాల్లో కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో జగన్ ప్రభుత్వానికి సమస్యగా మారుతోంది.

ఈ నేపథ్యంలో క్రమంగా గొంతు పెంచాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం సహా అన్ని సమస్యలను ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నారు. కీలక మైన సమావేశంలో చర్చలను అడ్డుకుంటున్నారు. పోడియం వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీ ఎంపీలు ఆందోళనకు పూనుకోవడం కీలక పరిణామంగా భావించవచ్చు. ఏపీకి రావాల్సిన నిధుల విషయంలో మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందనే వాదన ఉంది. చివరకు జీఎస్టీ బకాయిలు కూడా సకాలంలో విడుదల చేయకుండా జాప్యం చేస్తోంది. గడిచిన మూడేళ్లుగా పన్నుల్లో వాటా కూడా తగ్గిస్తోంది. దాంతో ఏపీ ప్రభుత్వం కొత్త అప్పులతో నెట్టుకురావాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.

Also Read : బీజేపీ లక్ష్యంగా ఢిల్లీ వైపు దీదీ.. రేపు దేశప్రజలకు సందేశం

కేంద్రం సానుకూలంగా స్పందిస్తే రాష్ట్ర ప్రభుత్వం కార్యకలాపాలకు ఆటంకం లేకుండా ఉంటుంది. కానీ దానికి భిన్నంగా ప్రస్తుత పరిస్థితి ఉండడంతో వైఎస్సార్సీపీ ఎంపీలు ఆందోళనకు పూనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ అంశంపై మంగళవారం రాజ్యసభలో కార్యకలాపాలు కొద్దిసేపు స్తంభించిపోయేలా ఆపార్టీ ఎంపీలు వ్యవహరించారు. ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు శ్రీ వి.విజయసాయి రెడ్డితోపాటు ప్రతిపక్ష సభ్యులు తాము రూల్‌ 267 కింద తాము ఇచ్చిన నోటీసును అనుమతించాలని కోరారు. దీనిపై చైర్మన్‌ స్పందిస్తూ రూల్‌ 267 కింద ఈరోజు 15 మంది సభ్యులు నోటీసులు ఇచ్చారని అందులో జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలు అనేకం ఉన్నప్పటికీ వాటిని ఇప్పటికిప్పుడు తాను చర్చకు అనుమంతించలేనని అన్నారు.

విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అన్నది కూడా జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశమే అంటూ దీనిపై చర్చకు మీరు ఎప్పుడు అనుమతిస్తారని ప్రశ్నించారు. చైర్మన్‌ దీనికి సమాధానం చెబుతూ దీనిపై వాదన వద్దని, ఈ అంశం (ప్రత్యేక హోదా) మీకు (రాష్ట్ర ప్రభుత్వం) కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదని జవాబిచ్చారు. దీంతో విజయసాయి రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద నిరసనకు దిగారు. ఇంతలో సభను సభలో గందరగోళం ఏర్పడటంతో చైర్మన్‌ సభను గంటపాటు వాయిదా వేశారు. సభ పునః ప్రారంభం తర్వాత కూడా వైఎస్సార్సీపీ పట్టువీడలేదు..

వ్యూహాత్మకంగా వైఎస్సార్సీపీ స్వరం పెంచుతున్న తరుణంలో కేంద్రంలో రాజకీయాలు కీలకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా లోక్ సభలో వైఎస్సార్సీపీ నాలుగో అతి పెద్ద పార్టీ. అంతేగాకుండా రాజ్యసభలో ఆపార్టీ బలం బీజేపీకి అత్యవసరం. ఈ పరిస్థితుల్లో ఎలాంటి సానుకూలత దక్కుతుందో చూడాలి.

Also Read : బీజేపీలో చేరటం కోసమే ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు,8 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారా?

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişMeritkingcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetcasibomMadridbetHoliganbet Giriş