బీవై రామయ్య..ప్రస్తుతం కర్నూలులో హాట్ టాపిక్ గా మారిన పేరు.. వైసీపీ అధిష్టానం కర్నూలు కార్పోరేషన్ మేయర్ అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో ఆయన పేరును పరిశీలిస్తుండడమే అందుకు కారణం. త్వరలో జరుగున్న కార్పోరేషన్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధినేత జగన్ బీవై రామయ్యపేరును ఎందుకు పరిశీలనలోకి తీసుకున్నట్లు? ఇప్పుడు ఇదీ చర్చనీయాంశం.
వివరాల్లోకి వెళితే.. బీవై రామయ్య..యువకునిగా రాజకీయాల్లోకి వచ్చిన ఉత్సాహ వంతుడు.. మొదట గంగులు ప్రతాప్ రెడ్డి అనుచరుడిగా ఉన్న రామయ్య, ఆయన ద్వారా చివరకు మాజీ సీఎం కోట్లకు దగ్గరయ్యారు. ఆయనకు నమ్మినబంటుగా ఉన్నారు. గడివేముల జెడ్పీటీసీగా గెలవడం ద్వారా నాయకుడుగా ఎదిగారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి ఆశించి నిరుత్సాహపడ్డా..కోట్లను మాత్రం వ్యతిరేకించలేదు. ఆయన అడుగు జాడల్లోనే నడిచారు.పైగా కోట్లకు రాజకీయంగా చేదోడు వాదోడుగా ఉండేవారు.అంతేకాదు ఎన్నికల వేళ పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, పార్టీ అభ్యర్థులు గెలుపుకోసం తెరవెనుక ఉండి చక్రం తిప్పేవారు. ఆ తర్వాత కోట్ల ఆదేశాల మేరకు నంద్యాల పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా ఆ పార్టీ ప్రగతికోసం కృషిచేశారు. ఆయన నాయకత్వ పటిమకు గుర్తింపుగా పార్టీ అధిష్టానం ఆయనకు డీసీసీ బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా ఎంతో సమర్థవంతంగా పనిచేశారు. కాంగ్రెస్ లో ఉన్నంత కాలం పార్టీకి, కోట్లకు విధేయునిగా నమ్మిన బంటుగా ఉన్నారు.
అయితే కోట్ల మరణం తర్వాత జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న సామెతను రుజువు చేస్తూ .. మాజీ కేంద్రమంత్రి, మాజీ సీఎం కోట్ల తనడుటు జయసూర్య ప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరారు. వాస్తవానికి జిల్లా రాజకీయాలు కోట్ల, కేఈ కుటుంబం చుట్టే తిరిగేవి. ఈ రెండు కుటుంబాలు మొదటి నుంచి బద్ద శత్రువులుగా ఉండేవంటారు. కర్నూలు పార్లమెంట్ బరిలో కోట్ల, కేఈ వర్గాల మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు సాగేది. అలాంటిది కోట్లవిజయభాస్కర్ రెడ్డి మరణం తర్వాత, కేఈ,కోట్లు కుటుంబాలు రాజీపడికోట్లు సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరారు. అలాంటి సమయంలో కోట్లు వర్గం నుంచి ఎంతో వత్తిడి వచ్చినా బీవై రామయ్య పార్టీ మారలేదు. అంతెందుకు కోట్లకు వీర విధేయుడైన మాజీ ఎమ్మెల్సీ, కర్నూలు మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ సుధాకర్ బాబు లాంటి వాళ్లు సైతం రామయ్యను టీడీపీలో చేరమని తీవ్రమైన ఒత్తిడి తెచ్చినా ససేమిరా అన్నారు. నమ్మిన సిద్దాంతాల కోసం కట్టుబడి ఉండే రామయ్యమ మనస్తత్వానికి ఇదో ఉదారణ. అదే ఆయన బలం. అదే యువకునిగా రాజీయల్లో చేరిన రామయ్యను అంచెలంచెలుగా ఏదిగేలా చేసింది.
మరోవైపు.. పార్టీ పదవులకోసమే, ఇతరత్రా అవకాశల కోసం నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం నేటి రాజకీయాల్లో సహజం. కానీ రామయ్యకు నమ్మినవాళ్లను మోసంచేయడం తెలీదు. వారి ఉన్నతికి కారణం అవ్వడమే తెలుసు. అంతేకాదు పార్టీలో కార్యకర్తలను,నాయకులను కలుపుకు పోవడం అనేది ఆయనకున్న అసలైన బలం. ప్రజలతో మమేకం కావడం ఆయన నైజం. అందుకే రామయ్య ఎక్కడున్నా మంచే చేస్తారు కాని, చెరుపు చేయరన్న పేరు ఉంది. అయితే కోట్లు కుటుంబం టీడీపీలో చేరడం, అనంతరం సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రామయ్య వైసీపీ గూటికి చేరారు. ఎందుకంటే రామయ్య కోట్ల కోటరీలో ఉన్నా..వైఎస్ అంటే ఆయనకు ఎంతో అభిమానం. అందుకే వైఎస్సార్ తనయుడు స్థాపించిన పార్టీ కాబట్టి వైసీపీలో చేరారు. ముందే అనుకున్నట్లు నమ్మిన వాళ్లకోసం ఎంతకైనా తెగించే మనస్థత్వం ఉన్న రామయ్య అధిష్టానం మెప్పు పొందారు. ప్రస్తుతం వైసీపీ పార్లమెంటు నియోజక వర్గ ఇంచార్జి భాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్నారు. పార్టీలో ఎలాంటి విబేధాలు తలెత్తినా సరిచేస్తూ, అటు కార్యకర్తలను,ఇటు నాయకులను సమన్వయం చేసుకుంటూ పోతున్నారు. ఎన్నికలు వచ్చినా తెరవెనుక ఉండి పార్టీ అభ్యర్థులు గెలుపుకోసం కృషి చేస్తున్నారు. అంటే తనను నమ్మి బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్ గు వీరవిధేయునిగా సాగుతున్నారు. అంటే నమ్మిన వాళ్లను మోసం చేయని ఆయన మనస్తత్వమే ప్రస్తుతం కర్నూలు మేయర్ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ఆయన పేరును పరిశీలించడానకి కారణం అంటున్నారు. అంతేకాదు ఆయన సాగించే నిజాయతీ రాజకీయాలకు గుర్తింపని వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తానికి రాజకీయంగా నమ్మిన వాళ్లుకోసం అహరహం పనిచేయడం, ఇచ్చిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడం, అందరినీ సమన్వయంచేసుకుంటూ పోవడం రామయ్య అసలైన పొలిటికల్ స్ట్రెంత్. ఆయన నాయకత్వ పటిమను గుర్తించే సీఎం జగన్ పార్లమెంట్ లోక్ సభ ఇంచార్జిగా ఇచ్చారన్నది వాస్తవం. ప్రస్తుతం రామయ్య కు సీఎం జగన్ కర్నూలు మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తేమాత్రం పార్టీ పరంగా ఆయనకు జిల్లాలో అగ్రతాంబుూలం దక్కినట్లే.