Idream media
Idream media
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం పునర్నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాత్రి మర్చి తోటలో పని వెళ్లి వస్తున్న కూలీల ట్రాక్టర్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆస్పత్రిలో మరణించారు.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కుటుంబాలకు నిన్న రాత్రి ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించిన వైసీపీ సర్కార్ తాజాగా ఈ రోజు ఆ మొత్తాన్ని రెట్టింపు చేసింది. బాధిత కుటంబాలకు పది లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది.
కాగా, ప్రకాశం జిల్లా మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌లు ఈ రోజు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇలాంటి ఘటన జరగడం బాధకరమన్నారు. బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఉద్యోగ ఇచ్చే అవకాశాలు ఉంటే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. పరిహారం విలైనంత వేగంగా అందిస్తామని చెప్పారు.