iDreamPost
android-app
ios-app

ఉత్తరాంధ్రను ఊపేస్తున్న ఫ్యాన్

  • Published Mar 14, 2021 | 7:56 AM Updated Updated Mar 14, 2021 | 7:56 AM
ఉత్తరాంధ్రను ఊపేస్తున్న ఫ్యాన్

ఓటర్ల ఆదరణతో తీవ్రంగా వీచిన ఫ్యాన్ గాలి ఉత్తరాంధ్రను సునామీలా ఉపేసింది. ఆ సునామీ ధాటికి తట్టుకోలేక టీడీపీ కంచుకోటలన్నీ కొట్టుకుపోతున్నాయి. మునుపెన్నడూ లేని రీతిలో మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఆదివారం ఉదయం మొదలైన ఎన్నికల కౌంటింగ్ తొలి ట్రెండ్స్ అధికార పార్టీ అద్భుత విజయాన్ని దాదాపు ఖరారు చేశాయి.

ఇప్పటికే ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోని అన్ని పట్టణాలు, నగర పంచాయతీల్లో అధికారానికి అవసరమైన మెజార్టీ వార్డులను వైస్సార్సీపీ గెలుచుకుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ తో పాటు విజయనగరం , శ్రీకాకుళం కార్పొరేషన్లు ఉండగా కోర్ట్ కేసు కారణంగా శ్రీకాకుళం లో ఎన్నికలు నిర్వహించలేదు. 8 మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకుగాను శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లో ఎన్నిక జరగలేదు.

గ్రేటర్ విశాఖలో దూకుడు

అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ లో తొలి రౌండ్ ఫలితాల్లో నే అధికార పార్టీ దూకుడు స్పష్టమైంది. జీవీఎంసీలో మొత్తం 98 డివిజన్లకు గాను.. తొలి రౌండ్ లెక్కింపు పూర్తి అయ్యేసరికి వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 27 చోట్ల విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థులు మూడు నాలుగు చోట్ల మాత్రమే ఆధిక్యత కాంబర్చారు. అంతకుముందు పోస్టల్ బ్యాలట్లలోనూ మెజార్టీ డివిజన్లలో అధికార పార్టీకే లీడ్ లభించింది.

విశాఖ జిల్లాలో..

జిల్లాలోని యాలమంచిలి మున్సిపాలిటీని వైస్సార్సీపీ తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ మొత్తం 25 వార్డులు ఉన్నాయి. ఏకగ్రీవమైన 3 వార్డులతో కలుపుకొని వైస్సార్సీపీ 23 వార్డులను చేజిక్కించుకుంది. మరో వార్డులో ఆ పార్టీ రెబల్ కైవసం చేసుకోగా.. టీడీపీ రెండు వార్డులకు పరిమితమైంది. నర్సీపట్నంలో వఉస్సారసీపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 28 వార్డుల్లో.. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. అధికార పార్టీకి 8 వార్డులు లభించాయి. టీడీపీ 2, జనసేన ఒకచోట విజయం సాధించాయి.

శ్రీకాకుళంలో స్వీప్

శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు జరిగిన రెండు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో వైస్సార్సీపీ పాగా వేసింది. పాలకొండ నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా.. ఏకగ్రీవం చేసుకున్న రెండు వార్డులతో కలుపుకొని మొత్తం 17 చోట్ల అధికార పార్టీ విజయం సాధించింది. టీడీపీకి మూడు వార్డులు దక్కాయి.

ఇచ్చాపురంలో 23 వార్డులకు గాను ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం 16 వార్డుల్లో వైస్సార్సీపీ, 4 చోట్ల టీడీపీ విజయం సాధించాయి. మిగిలిన 3 వార్డుల ఫలితాలు అందాల్సి ఉంది.

పలాస-కాశీబుగ్గలో 31 వార్డులకు 2 అధికార పార్టీకి ఏకగ్రీవమయ్యాయి. వీటితో కలుపుకొని ఇప్పటివరకు 19 వార్డులను గెలుచుకుని ఆ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. టీడీపీ ఒక్కచోటే గెలిచింది. మిగిలిన వార్డుల కౌంటింగ్ జరుగుతోంది.

విజయనగరంలో విజయ బావుటా

విజయనగరం జిల్లాలో ని విజయనగరం నగర పాలక సంస్థలో ఆధిక్యంలో ఉన్న వైస్సార్సీపీ సాలూరు, నెల్లిమర్లలను తన ఖాతాలో వేసుకుంది. సాలూరులో 29 వార్డులకు గాను..అధికార పార్టీ 20 చోట్ల గెలిచింది.

టీడీపీ 5 చోట్ల గెలవగా, స్వతంత్రులు 4 వార్డులను చేజిక్కించుకున్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీలో 20 వార్డులకు గాను వైస్సార్సీపీ ఖాతాలో 11 వార్డులు చేరాయి. టీడీపీ 7, స్వతంత్రులు 2 చోట్ల విజయం సాధించారు. పార్వతీపురం లో 30 వార్డులు ఉండగా.. ఏకగ్రీవం చేసుకున్న 6 వార్డులతో కలిపి 8 చోట్ల వైస్సార్సీపీ విజయం సాధించింది. స్వతంత్రులు 2 వార్డులు దక్కించుకోగా టీడీపీ ఒక్కచోటే విజయం సాధించింది. మిగతా వార్డుల్లో అత్యధికం అధికార పార్టీ అభ్యర్థులే లీడ్ లో ఉన్నారు.

బొబ్బిలి కోటలో 31 వార్డులకు గాను.. అధిక స్థానాల్లో అధికార పార్ట్ హవా కనిపిస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఒక ఏకగ్రీవంతో కలిపి ఆ పార్టీ 6 చోట్ల విజయం సాధించింది. టీడీపీ రెండు వార్డుల్లో గెలిచింది.

విజయనగరం కా eర్పొరేషన్ లో 50 వార్డులకు గాను ఒక డివిజన్లలో విజయం సాధించిన వైస్సార్సీపీ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.