iDreamPost
android-app
ios-app

కెజిఎఫ్ హీరో కొత్త సినిమా

  • Published Jun 17, 2021 | 7:30 AM Updated Updated Jun 17, 2021 | 7:30 AM
కెజిఎఫ్ హీరో కొత్త సినిమా

కెజిఎఫ్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో యష్ తన తర్వాతి సినిమాల విషయంలో చాల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడొచ్చిన క్రేజ్ ని చూసుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇకపై తను చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లోనే వెళ్తుంది కాబట్టి దానికి తగ్గట్టే కథలు దర్శకుల ఎంపికలో తెలివిగా సాగుతున్నాడు. ఆ మధ్య పూరి జగన్నాధ్ తో చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది కానీ లైగర్ రిజల్ట్ చూశాకే దానికి సంబంధించిన ఏదైనా అప్ డేట్ రావొచ్చు. వీటి సంగతలా ఉంచితే  యష్ మాత్రం తన కొత్త ప్రాజెక్ట్ కోసం ఆల్రెడీ ఓ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

దాని ప్రకారం యష్ త్వరలో నర్తన్ దర్శకత్వంలో చేయబోతున్నట్టు తెలిసింది. ఇతను ఒకప్పుడు ప్రశాంత్ నీల్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన వాడే. శివరాజ్ కుమార్-శ్రీమురళి కాంబోలో మఫ్టీ అనే సూపర్ హిట్ తీశాడు. ఇందులో ఇతని గురువు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ రికమండేషన్ కూడా ఇందులో ఉన్నట్టు బెంగుళూరు టాక్. అయితే ఇది ఇంకా అఫీషియల్ కాలేదు. జీ స్టూడియోస్ – హోంబాలే ఫిలిమ్స్ సంయుక్తంగా దీన్ని నిర్మించబోతున్నారట. సహజంగానే బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతోంది. రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యాక విడుదల గురించి క్లారిటీ వస్తుంది.

ప్రస్తుతం యష్ కెజిఎఫ్ 2 ప్రమోషన్ మీధ దృష్టి పెట్టబోతున్నాడు. కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోయి థియేటర్లు మెల్లగా తెరుచుకుంటున్న తరుణంలో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. రాధే శ్యామ్, ఆచార్య, పుష్ప, మేజర్ లాంటి ఇతర పాన్ ఇండియా మూవీస్ తో క్లాష్ రాకుండా చూసుకోవాలని నిర్మాతలు ప్లానింగ్ లో ఉన్నారు. వంద శాతం కెపాసిటీకి అనుమతులు వచ్చాకే ఇలాంటి వాటికి వర్కౌట్ అవుతుంది కాబట్టి సెప్టెంబర్ దాకా కెజిఎఫ్ 2 రావడం అనుమానమే. పరిస్థితులు ఎలా ఉన్నా ఖచ్చితంగా ఈ ఏడాది లోపే రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టిగా నిర్ణయించుకున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.