iDreamPost
iDreamPost
ప్రియుడు తనను మోసం చేస్తున్నాడని తెలుసుకున్న ప్రేయసి.. అతనింక బ్రతికే అర్హత లేదనుకుంది. ఎలాగైనా అతడిని ఈ లోకంలోనే లేకుండా చేయాలనుకుంది. తనకారుతో అతడిని ఢీ కొట్టి.. కడతేర్చింది. ఈ ఘట అమెరికాలోని ఇండియానాపొలిస్ లో జరిగింది. గైలిన్ మోరిస్ (26) అనే యువతి, ఆండ్రే స్మిత్ అనే వ్యక్తి ప్రేమించుకున్నారు. కొంతకాలం క్రితం ఆండ్రే మరొక స్త్రీతో కనిపించాడు. అప్పట్నుంచి గైలిన్ అతనిపై కోపం పెంచుకుంది.
అతడిని ఎలాగైనా హతమార్చాలనుకుని.. అతని వస్తువులపై ఓ ఆపిల్ ఎయిర్ టాగ్ ను ఫిక్స్ చేసింది. అతను ఎక్కడికి వెళ్లినా.. వెంటనే గైలిన్ కు తెలిసేది. ఈ క్రమంలో ఆండ్రే ఒక బార్ వద్ద ఉన్నట్లు ఆపిల్ ఎయిర్ టాగ్ ద్వారా తెలియగా.. గైలిన్ కోపంతో అక్కడికి వెళ్లింది. అప్పుడు కూడా ఆండ్రేతో మరో మహిళ ఉండటంతో.. ఖాళీ వైన్ సీసాతో అతనిపై దాడి చేయబోయింది. బార్ సిబ్బంది జోక్యం చేసుకుని.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ముగ్గురినీ పంపించేశారు.
ఆ తర్వాత గైలిన్ తన కారుతో బార్ ఎదుటే బలంగా ఢీ కొట్టి, మూడుసార్లు కారుతో తొక్కించి కసిగా కడతేర్చింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. గైలిన్ మోరిస్ ను అరెస్ట్ చేశారు.