iDreamPost
android-app
ios-app

ఈ రిస్కీ కాంబినేషన్ సాధ్యమేనా

  • Published Mar 22, 2021 | 9:54 AM Updated Updated Mar 22, 2021 | 9:54 AM
ఈ రిస్కీ కాంబినేషన్ సాధ్యమేనా

ప్రస్తుతం బోయపాటి శీను సినిమాలో చాలా బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ తర్వాత క్రాక్ ఫేమ్ గోపిచంద్ మలినేనితో చేయబోతున్న సంగతి తెలిసిందే. దీన్నో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దబోతున్నారు. షూటింగ్ ఈ వేసవిలోనే ప్రారంభించబోతున్నారు. మైత్రి బ్యానర్ కావడంతో నిర్మాణ విలువల గురించి ఫ్యాన్స్ టెన్షన్ పడటం లేదు. దీని తర్వాత బాలయ్య ఎవరితో టై అప్ అవుతారనే సస్పెన్సు మాత్రం ఇంకా కొనసాగుతోంది. అనిల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్టర్లు సైతం తమ దగ్గర కథలున్నాయని చెబుతున్నారు కానీ నిజంగా అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో అంతు చిక్కడం లేదు. ఇప్పుడో కొత్త టాపిక్ తెరమీదకొచ్చింది.

దాని ప్రకారం బాలకృష్ణ త్వరలో తండ్రి వయసున్న పాత్ర చేయబోతున్నారట. అందులో టీనేజ్ అమ్మాయి కూతురిగా నటిస్తుందని తెలిసింది. ప్రాధమిక దశలో బాలయ్యకు కథ బాగానే నచ్చిందని, డెబ్యూ డైరెక్టర్ కాబట్టి ఫుల్ వెర్షన్ విన్నాక నిర్ణయం తీసుకుంటానని చెప్పారట. ఒకవేళ నచ్చితే మాత్రం ఇదో సంచలనం అవుతుంది. అయితే కూతురి క్యారెక్టర్ కి స్టార్ హీరోయిన్ అయితేనే న్యాయం చేయగలుగుతుందనే ఉద్దేశంతో సాయి పల్లవిని కలిసే ఆలోచనలో సదరు దర్శకుడు ఉన్నట్టు వినికిడి. ఇది నిజమో కాదో ఇంకా ధృవీకరణ రావాల్సి ఉంది. అయితే చాలా టైం పడుతుంది. అప్పటిదాకా వేచి చూడాల్సిందే.

గతంలో శోభన్ బాబు ఇలాంటి సినిమాలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో ఆయన నటించిన సర్పయాగం అప్పట్లో పెద్ద హిట్టు. అందులో ఆయన కూతురిగా ఇప్పటి ఎమ్మెల్యే, మాజీ నటి రోజా నటించారు. బిడ్డచావుకు కారణమైన వాళ్ళను చంపే డాక్టర్ పాత్రలో శోభన్ బాబు అందులో విశ్వరూపం చూపించారు. వెంకటేష్ దృశ్యంలో ఇదే తరహాలో వయసుకొచ్చిన కూతురి కోసం చట్టాన్ని ఎదిరించే వాడిగా మెప్పించిన సంగతి గుర్తేగా. ఇప్పుడు బాలయ్య కూడా ఆ రూట్లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. మరి డబుల్ రోల్ ఉంటుందా లేదా సింగిల్ పాత్రా అనేది తెలియాలంటే వేచి చూడాలి మరి.