iDreamPost
android-app
ios-app

God Father : మెగాస్టార్ కు బాలీవుడ్ వాసన కలిసొస్తుందా?

God Father : మెగాస్టార్ కు బాలీవుడ్ వాసన కలిసొస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి తెలుగులో తాను ఏంటో నిరూపించుకున్నాక బాలీవుడ్ వైపు అడుగులు వేశారు. అప్పట్లో చిరంజీవి కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెలుగులో రాజశేఖర్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అంకుశం’ సినిమా హిందీ రీమేక్‌ ‘ప్రతిబంధ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని హిందీలో రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు. బాలీవుడ్‌లో హీరోగా చిరంజీవితో పాటు.. దర్శకుడిగా రవిరాజా పినిశెట్టికి ఇదే మొదటి సినిమా కాగా నిర్మాతగా అల్లు అరవింద్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తరువాత ఇక్కడి గ్యాంగ్ లీడర్ ను అక్కడ ఆజ్ కా గూండా రాజ్ గా తెరకెక్కించగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తర్వాత తమిళ్ జెంటిల్మెన్ ను అదే పేరుతో అక్కడ తెరకెక్కిస్తే అది వర్కౌట్ కాలేదు.

దీంతో చిరు బాలీవుడ్ వంక చూడటం మానేశారు. అయితే చిరు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లో బాలీవుడ్ నటులు అమ్రిష్ పూరి లాంటి వాళ్ళు నటించారు కానీ గతంలో ‘సైరా నరసింహారెడ్డి’లో అమితాబ్‌.. చిరంజీవికి గురువు పాత్రలో నటించగా ఆ సినిమానే అంతగా జనని మెప్పించ లేకపోయింది. ఇక అయినా వెనక్కు తగ్గని ఆయన ఇప్పుడు సల్మాన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు ప్రచారానికే పరిమితం అయిన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్న విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కన్ఫర్మ్ చేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో మోహన్ లాల్ హిట్ సినిమా లూసిఫర్ ని తెలుగులో ‘గాడ్ ఫాథర్’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి హీరో. సల్మాన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. చిరంజీవి, సల్మాన్ కలిసి ఓ పాటకు స్టెప్పులు కూడా వేస్తారని సంగీత దర్శకుడు తమన్ ఆ మధ్య లీకులు ఇవ్వగా ఇప్పుడు సల్మాన్ కూడా సినిమాలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. అయితే మరి ఈసారి అయినా బాలీవుడ్ వాసన చిరంజీవికి కలిసి వస్తుందో లేదో చూడాలి.

ఎందుకంటే బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తే ఒకటి సూపర్ హిట్ అనిపించుకోగా మరొకటి యావరేజ్ గా మరొకటి మరీ దారుణంగా రిజల్ట్స్ తెచ్చుకున్నాయి. తన కుమారుడు రామ్ చరణ్ ను అక్కడ లాంచ్ చేయాలని చూసినా అక్కడ కూడా దారుణమైన రిజల్ట్స్ వచ్చాయి. సైరా లో అమితాబ్ ఉంటారు కాబట్టి హిందీలో బాగా ఆడుతుంది అనుకుంటే ఆ అంచనా కూడా తప్పింది. ఈ సారి ఎం జరగనుంది అనేది చూడాలి. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే… దగ్గుబాటి హీరో తో కూడా సినిమా చేయనున్నట్లు చెప్పారు సల్మాన్. వెంకటేశ్‌తో చేయబోతున్నాని ఆయన చెప్పారు. సల్మాన్ ఖాన్ నటించిన ‘అంతిమ్’ ఇటీవల విడుదలైంది. ఆ సినిమా ప్రచారం నిమిత్తం హైదరాబాద్ వచ్చిన సల్మాన్… చిరంజీవి, వెంక‌టేశ్‌తో సినిమాల గురించి వెల్లడించారు. ‘అంతిమ్: ద ఫైనల్ ట్రూత్’ సినిమాలో సల్మాన్ ఖాన్‌తో పాటు ఆయన బావ ఆయుష్ శర్మ హీరోగా నటించారు.

Also Read : Shyam Singha Roy : హిందీ లో రీమేక్ కాబోతున్న నాని సినిమా ‘శ్యామ్ సింగరాయ్’.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişgrandpashabet