iDreamPost
iDreamPost
కింగ్ నాగార్జున కొత్త సినిమా వైల్డ్ డాగ్ నిన్నటిదాకా ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలవుతుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అది నిజమో కాదో యూనిట్ కానీ హీరో కానీ ఎక్కడ ధృవీకరించలేదు. అయితే న్యూస్ మాత్రం తెగ హడావిడి చేసింది. విశ్వసనీయ వర్గాల మేరకు అది నిజమే కానీ తాజాగా కొత్త ట్విస్ట్ వచ్చి పడింది. వైల్డ్ డాగ్ ని ఇప్పుడు థియేట్రికాల్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు తెలిసింది. ఆ మేరకు నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులతో అగ్రిమెంట్ మార్చుకునే దిశగా చర్చలు కూడా ఆల్రెడీ మొదలుపెట్టేశారట. దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకో వారం లో రావొచ్చు.
ఒకవేళ ఇక్కడ చెప్పినట్టు జరిగితే వైల్డ్ డాగ్ ని ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటికే ఆ తేదీకి సీటిమార్, సుల్తాన్ లు షెడ్యూల్ అయ్యాయి. ఒకవేళ వైల్డ్ డాగ్ వస్తానంటే వాటిలో ఒకటి వెనక్కు జరుగుతుందా లేదా మూడూ పోటీకి సై అంటాయా అనేది వేచి చూడాలి. నాగార్జునను పెద్ద తెరమీద చూసి ఏడాదిన్నరకు పైగా కావడంతో వైల్డ్ డాగ్ సిల్వర్ స్క్రీన్ మీదే రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందులోనూ ఇది యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ అయితేనే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం. మొత్తానికి అడుగులైతే వేగంగా పడుతున్నాయి.
2019లో మన్మధుడు 2 డిజాస్టర్ తర్వాత నాగార్జున మళ్ళీ తెరమీద కనిపించలేదు అందుకే వైల్డ్ డాగ్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అన్నీ సరిగ్గా కుదిరితే నాగ్ ని ఈ ఏడాది రెండు సినిమాల్లో చూడొచ్చు. బాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ బ్రహ్మాస్త్రలో కూడా నాగార్జున ఓ కీలక పాత్ర చేశారు. కానీ ఈ సంవత్సరమే విడుదల సాధ్యమా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఇక వైల్డ్ డాగ్ విషయానికి వస్తే హీరోయిన్, కమర్షియల్ ఎలిమెంట్స్, మసాలాలు ఇవేవి లేకుండా అహిషోర్ సాల్మోన్ రూపొందించిన విధానం ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. మరి వైల్డ్ డాగ్ ఏ రూపంలో రాబోతున్నాడో లెట్ వెయిట్ అండ్ సి