iDreamPost
android-app
ios-app

రాములమ్మ సెలవుకు కారణం ?

  • Published Feb 03, 2020 | 11:07 AM Updated Updated Feb 03, 2020 | 11:07 AM
రాములమ్మ సెలవుకు కారణం ?

సుమారు 13 ఏళ్ళ తర్వాత సరిలేరు నీకెవ్వరుతో కంబ్యాక్ ఇచ్చిన టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇవాళ అందరికి థాంక్స్ చెబుతూ సెలవు తీసుకుంటున్న ట్వీట్ చూసి అభిమానులు షాక్ తిన్నారు. ఇకపై కంటిన్యూగా సినిమాలు చేస్తారనుకుంటే ఇలా అనేశారేంటని ఫీలైనవాళ్ళే ఎక్కువ. కారణం పేర్కొనలేదు, ఇకపై మూవీస్ లో కొనసాగుతారా లేదా చెప్పలేదు. ప్రస్తుతానికి సెలవు అంటే ఇప్పట్లో చేసే ఉద్దేశంలో లేదని పరోక్షంగా చెప్పినట్టే. 

నిజానికి సరిలేరు నీకెవ్వరులో విజయశాంతికి తన స్థాయి పాత్ర కాకపోయినా కథ ప్రకారం బాగానే వెయిట్ వచ్చింది. ఆవిడ కాకుండా వేరే రెగ్యులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుంటే ఇంత హైప్ వచ్చేది కాదు. ఆరకంగా విజయ శాంతి క్యారెక్టర్ బాగానే కనెక్ట్ అయ్యింది. ఇతర దర్శక నిర్మాతల ఉంచి ఆఫర్స్ వస్తున్నాయని కూడా టాక్ వచ్చింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు గుడ్ బై చెబుతోంది మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్లడం కోసమేమోననే అనుమానం రాకమానదుఏది ఏమైనా ఇలాంటి నిర్ణయం మాత్రం ఆహ్వానించేది కాదు. 

ఆ మధ్య చిరంజీవితో కలిసి స్టేజి మీద మాట్లాడుతూ కుదిరితే కలిసి సినిమా చేద్దామని చెప్పిన కొద్దిరోజులకే ఇల్లా చెప్పడం ఆశ్చర్యకరమే. తెలుగులో అగ్ర స్టార్ హీరోలందరి సరస బ్లాక్ బస్టర్లు ఇండస్ట్రీ హిట్లు తన ఖాతాలో వేసుకున్న విజయశాంతి కొనసాగాలే కానీ ఆఫర్లకేమి లోటు ఉండదు. కానీ వస్తున్న కథలన్నీ చాలా రొటీన్ పాయింట్ తో ఉన్నాయని అందులోనూ తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా చెబుతున్నారని అందుకే విసుగు చెందిన విజయ శాంతి ఈ డెసిషన్ తీసుకున్నారని మరో టాక్ ఉంది. ఏది ఏమైనా మరోసారి పునరాలోచించుకుని తెరపై కొనసాగేలా విజయశాంతిని కోరుతున్నారు అభిమానులు. మరి ఆవిడ వాళ్ళ కోరికను మన్నిస్తారో లేదో?

marsbahis girişjojobet girişjojobet girişjojobetjojobet girişjojobet girişJOJOBET GİRİŞholiganbetjojobetjojobet girişgamdom