iDreamPost
android-app
ios-app

Venky Kudumula : వెంకీ కుడుముల – ఇంత ఆలస్యమేలా

  • Published Nov 22, 2021 | 6:24 AM Updated Updated Nov 22, 2021 | 6:24 AM
Venky Kudumula : వెంకీ కుడుముల – ఇంత ఆలస్యమేలా

ఇండస్ట్రీలో త్వరగా అవకాశాలు రావాలన్నా హీరోలు క్యూ కట్టాలన్నా దర్శకులకు సక్సెస్ ఒక్కటే కొలమానం. అది సాధిస్తే చాలు ఖాళీగా కూర్చునే అవసరం లేనంతగా ఆఫర్లు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కానీ కొందరి విషయంలో మాత్రం ఇది విచిత్రంగా ఉంటుంది. ఛలోతో నాగ శౌర్య కెరీర్ లోనే ఏకైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల తన రెండో సినిమా భీష్మతోనూ అదే ఫీట్ సాధించాడు. గత ఏడాది రిలీజై నితిన్ కు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ ఎంటర్ టైనర్ వసూళ్లు కూడా ఘనంగా తెచ్చుకుంది. ఇది జరిగి పదిహేడు నెలలవుతోంది. కానీ ఇంతా చేసి వెంకీ కుడుములు కొత్త సినిమా ఏడాదిన్నర తర్వాత కూడా ఇంకా ప్రారంభం కాకపోవడం అసలు విచిత్రం.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వస్తున్న వార్తలు మీడియాలో గట్టిగానే తిరుగుతున్నాయి. గతంలో వెంకీ కుడుముల చిరుని కలిసి ఓ కథ వినిపించిన మాట వాస్తవం. కానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనేది బయటికి రాలేదు. అసలు ఇప్పుడు చిరంజీవే వరుస ప్రాజెక్టులతో యమా బిజీగా ఉన్నారు. ముందు గాడ్ ఫాదర్ పూర్తి చేయాలి. వెంటనే భోళా శంకర్ కు సర్వం సిద్ధంగా ఉంది. జాయిన్ కావడమే ఆలస్యం.ఇదయ్యాక మైత్రి నిర్మిస్తున్న వాల్తేర్ వీరయ్య(ప్రచారంలో ఉన్న టైటిల్) సెట్స్ పైకి వెళ్తుంది. ఇవన్నీ పూర్తవ్వడానికి ఎంతలేదన్నా వచ్చే దసరానో దీపావళినో కావాలి. అంటే అటుఇటుగా ఇంకో సంవత్సరం అన్నమాట

అప్పటిదాకా వెంకీ మళ్ళీ వెయిటింగ్ లోనే ఉంటాడా అంటే సమాధానం దొరకడం లేదు. ఆసలీపాటికి మీడియం రేంజ్ హీరోలతో రెండు సినిమాలు ఈజీగా చేసేయొచ్చు. అలాంటిది మరి చిరు కోసం ఈ ఎదురు చూపులా లేక ఏవైనా సడన్ గా ఆగిపోయాయా తెలియాల్సి ఉంది. కొత్త జనరేషన్ దర్శకులతో చేసేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్న చిరంజీవి ఆ క్రమంలోనే ఒక్కొక్కరిని లాక్ చేసుకుంటూ పోతున్నారు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మారుతీ తాను కూడా మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నట్టు చెప్పాడు. మరి వెంకీ కుడుముల గురించి వచ్చిన వార్త నిజమా కాదా తెలియాలంటే ఆయనే చెప్పాలి లేదా డివివి దానయ్య వెల్లడించాలి. ఈ కాంబినేషన్ సెట్ చేస్తోంది ఆయనేనని వినికిడి. త్వరలోనే అఫీషియల్ అవ్వొచ్చు అంటున్నారు. చూద్దాం

Also Read : Ghani : శ్యామ్ కి దారి వదిలేసిన మెగా సినిమా ?

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alBetraBetraBetrakatlaCasibom GirişMarsbahis GirişCasibom Giriş