iDreamPost
iDreamPost
1995లో వైశ్రాయ్ కుట్రతో ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికయిన తరువాత జరిగిన తోలి శాసనసభ సమావేశంలో ఎన్టీఆర్ తనకు మాట్లడే అవకాశం ఇవ్వమని అడిగినా అప్పటి స్పీకర్ యనమల ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీనితో నిరసన ప్రకటించి నిరాశతో ఎన్టీఆర్ సభను వీడాడు.
ఈరోజు శాసనసభ లాబీలో ఆనాటి సంఘటన గురించి యనమల రామకృష్ణుడు మాట్లాడాడు. బీఏసీ(Business Advisory Committee) సమావేశానికి తనను ఎందుకు పిలవలేదనే విషయం మీద మాట్లాడతానని ఎన్టీఆర్ అడిగారని, నిబంధనల ప్రకారం కొత్త నాయకుడు చంద్రబాబును పిలిచాను కాబట్టి ఆ అంశం మీద చర్చించవలసిన అవసరం లేదని అందుకే ఎన్టీఆర్ కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని యనమల చెప్పాడు.
యనమల చెప్పినదాంట్లో ఎంత నిజముందో ఆయనకు,దివంగత ఎన్టీఆర్ కు తెలియాలి కానీ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించిన తరువాత తనకు కనీసం శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అని ఎన్టీఆర్ కన్నీరు పెట్టుకోవటం గురించి పత్రికలు రాశాయి.
పదివీచ్యుతుడైన ముఖ్యమంత్రికి మాట్లాడే అవకాశం కల్పించే నిబంధన ఒక్కటి కూడా లేదా?యనమల రామకృష్ణుడే చెప్పాలి.