iDreamPost
android-app
ios-app

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చాడా!

  • Published Dec 10, 2022 | 10:53 AM Updated Updated Dec 10, 2022 | 10:53 AM
  • Published Dec 10, 2022 | 10:53 AMUpdated Dec 10, 2022 | 10:53 AM
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చాడా!

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని పట్టాలెక్కించకుండా అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్నాడు. మరోవైపు తనతో కలిసి ‘ఆర్ఆర్ఆర్’లో నటించిన రామ్ చరణ్ ఇప్పటికే ‘ఆచార్య’తో ప్రేక్షకులను పలకరించాడు. అలాగే శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ ని సగానికి పైగా పూర్తి చేశాడు. ఎన్టీఆర్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ వచ్చి ఎనిమిది నెలలు దాటినా కొత్త సినిమాకి టెంకాయ కొట్టలేదు. రెస్ట్, ఫ్యామిలీ టూర్స్ అంటూ నెలలు నెలలు గడిపేస్తూ ఫ్యాన్స్ ని ఫీలయ్యేలా చేస్తున్నాడు.

నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ అటకెక్కి.. కొరటాల శివతో ‘ఎన్టీఆర్ 30’ సినిమా ప్రకటన వచ్చింది. అయితే ‘ఆచార్య’ ఘోర పరాజయంతో కొరటాల ప్రాజెక్ట్ ని కూడా ఎన్టీఆర్ పక్కన పెడతాడని ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కూడా బలంగా వార్తలు వినిపించాయి. కానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని మేకర్స్ ప్రకటించి ఫ్యాన్స్ ని కాస్త కూల్ చేశారు. అయితే అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియక ఫ్యాన్స్ నీరసపడిపోతున్నారు.

‘ఆచార్య’ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన కొరటాల ఆ నష్టాల తలనొప్పులతో చాలా రోజుల పాటు ‘ఎన్టీఆర్ 30’పై దృష్టి పెట్టలేకపోయాడని అప్పుడు న్యూస్ వినిపించింది. ఎన్టీఆర్ కూడా ‘ఆచార్య’ దెబ్బతో స్క్రిప్ట్ లో చాలా మార్పులు చెప్పాడని.. పాత కథని పక్కన పెట్టి, మరో కొత్త కథతో సినిమా చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఇలా ఏవేవో కారణాల వల్ల ప్రతి నెలా ఈ నెలే ఓపెనింగ్ అంటూ ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు తీసుకొచ్చారు. ఇప్పుడేమో డిసెంబర్ కూడా లాంచ్ లేదు, ఫిబ్రవరిలో ఉండొచ్చు అంటున్నారు. దానికి తగ్గట్లే తాజాగా ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి నెలరోజుల ట్రిప్ కోసం అమెరికా వెళ్ళాడు. దీంతో ఇక ఫ్యాన్స్ సహనం నశించింది. “ఇంకెంతకాలం ఎదురుచూడాలి అన్నా.. సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తే చెప్పేయ్.. ‘ఎన్టీఆర్ 30’ కోసం ఎదురుచూడటం మానేసి నీ పాత సినిమాలు చూస్తూ గడిపేస్తాం” అంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ‘ఎన్టీఆర్ 30’ లాంచ్ కోసం ఫ్యాన్స్ నెలలు తరబడి ఎదురుచూస్తుంటే.. ఎన్టీఆర్ మాత్రం ఇలా నెల రోజుల ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్ళడం ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio