iDreamPost
android-app
ios-app

ఇదేం ప్లానింగ్ గాడ్ ఫాదర్

  • Published Sep 17, 2022 | 6:05 PM Updated Updated Dec 09, 2023 | 12:32 PM

రెండు రోజుల క్రితం చిరు సల్మాన్ ఖాన్ ల కాంబో లిరికల్ సాంగ్ ని యుట్యూబ్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ సమయానికి టైమర్ పెట్టుకుని మరీ ఎదురు చూస్తే తూచ్ సాంకేతిక కారణాల వల్ల ఇంకా అవ్వలేదు, ప్రస్తుతానికి స్పాటిఫైలో వినమని సెలవిచ్చి తుర్రుమన్నారు.

రెండు రోజుల క్రితం చిరు సల్మాన్ ఖాన్ ల కాంబో లిరికల్ సాంగ్ ని యుట్యూబ్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ సమయానికి టైమర్ పెట్టుకుని మరీ ఎదురు చూస్తే తూచ్ సాంకేతిక కారణాల వల్ల ఇంకా అవ్వలేదు, ప్రస్తుతానికి స్పాటిఫైలో వినమని సెలవిచ్చి తుర్రుమన్నారు.

ఇదేం ప్లానింగ్ గాడ్ ఫాదర్

కేవలం ఇంకో 18 రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా గాడ్ ఫాదర్ విడుదల కానుంది. ప్రమోషన్ల విషయంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ చూపిస్తున్న అలసత్వం అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. రెండు రోజుల క్రితం చిరు సల్మాన్ ఖాన్ ల కాంబో లిరికల్ సాంగ్ ని యుట్యూబ్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ సమయానికి టైమర్ పెట్టుకుని మరీ ఎదురు చూస్తే తూచ్ సాంకేతిక కారణాల వల్ల ఇంకా అవ్వలేదు, ప్రస్తుతానికి స్పాటిఫైలో వినమని సెలవిచ్చి తుర్రుమన్నారు. ఇది జరిగి నలభై ఎనిమిది గంటలు దాటినా ఇంకా ఆ పాట తాలూకు ప్రాపర్ అప్ డేట్ రాలేదు. ఆల్రెడీ వచ్చిన టీజర్ పెద్దగా కిక్ ఇవ్వని నేపథ్యంలో బజ్ రావాలంటే ఇలా ఉంటే సరిపోదు.

సత్యదేవ్, నయనతారల క్యారెక్టర్లకు సంబంధించిన పోస్టర్లు వదలడం తప్ప ఈ మధ్య కాలంలో గాడ్ ఫాదర్ టీమ్ చేసిందేమి లేదు. అక్టోబర్ 5 అదే రోజు వస్తున్న నాగార్జున ది ఘోస్ట్ మాత్రం ఈ విషయాల్లో ముందుంది. ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నిన్న వదిలిన పాటలో హీరోయిన్ తో నాగ్ కెమిస్ట్రీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఘోస్ట్ పబ్లిసిటీని వచ్చే వారం నుంచి స్పీడ్ పెంచబోతున్నారు. బ్రహ్మాస్త్ర ఈవెంట్ల కోసం కొంత టైం కేటాయించిన నాగ్ ఇకపై పూర్తిగా తన సినిమాను పబ్లిక్ కు చేరువ చేసే పనుల్లో బిజీ అవుతారు. గాడ్ ఫాదర్లో మాత్రం ఎలాంటి కదలిక లేదు.

అసలే మలయాళం లూసిఫర్ బ్లాక్ బస్టర్. అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటికే తెలుగు డబ్బింగ్ వెర్షన్ ని చాలా మంది చూసేశారు. పోనీ దాన్నేమైనా తీయించే ప్రయత్నం చేశారా అంటే అదీ లేదు. పెద్ద క్యాస్టింగ్, భారీ బడ్జెట్, తమన్ మ్యూజిక్, హీరోయిన్ లేకుండా గ్రే హెయిర్ తో చిరు సరికొత్త అవతారం ఇన్ని సానుకూల అంశాల్లో దేన్నీ వాడుకోకపోవడం మరీ విచిత్రం. అంత పెద్ద సల్మాన్ ఖాన్ క్యామియో చేస్తే దాన్ని సైతం సరైన రీతిలో రిజిస్టర్ చేయలేకపోతున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ డ్రామా నిజంగా దసరా విడుదలకు కట్టుబడుతుందా లేదా ఫ్యాన్స్ భయపడుతున్నట్టు ఏమైనా షాక్ ఇస్తుందా వేచి చూడాలి. వేరే ఆప్షన్ లేదు

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet GirişJojobetjojobet