నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీ లో ఎమ్మెల్సీ పదవి కోసం పైరవీలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే కోటాలో ఆకుల లలిత ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో మళ్లీ ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం లేదని టిఆర్ఎస్ హైకమాండ్ ఆదేశాలు ఇవ్వడంతో ఎలాగైనా ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవాలని జిల్లాలో టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
అయితే ఈ ఎమ్మెల్సీ పదవి మాజీ టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకే ఎమ్మెల్సీ పదవి దక్కుతుంది ఆశతో ఉన్నారు.
జిల్లాలో మరో సీనియర్ నేత అరికేలా నర్సిరెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి కోసం టిఆర్ఎస్ ఎమ్మెల్సీ, కెసిఆర్ కూతురు కవిత ద్వారా లాబీయింగ్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ కవితతో రెండు గంటల పాటు భేటీ అయిన అరికేలా నర్సిరెడ్డి మళ్ళీ జిల్లాలో యాక్టివ్ పాలిటిక్స్ లో పాల్గొంటున్నాడు. టిడిపిలో సీనియర్ నేతగా, ఎమ్మెల్సీగా పనిచేసిన నర్సిరెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.అసెంబ్లీ ఎన్నికల తర్వాత హస్తంకు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే అప్పటి నుంచి ఏదో ఒక పదవి వస్తుందని ఆశిస్తున్నా నర్సిరెడ్డి ఇప్పటివరకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఎలాంటి పదవి లేకుండా జిల్లాలో పర్యటించేందుకు నర్సిరెడ్డి విముఖత వ్యక్తం చేస్తుండడంతో ఏదైనా నామినేటెడ్ పోస్టులు దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆకుల లలితకు రెండోసారి అవకాశం లేదు..
2008లో డిచ్ పల్లి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆకుల లలిత,2015లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో ఆర్ముర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి జీవన్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆకుల లలితకు మళ్ళీ అవకాశం ఇవ్వకూడదని ఆకుల లలిత, ఆమె భర్త అవినీతికి పాల్పడుతున్నారని స్థానిక నేతలు అధినాయకత్వంకు ఫిర్యాదు చేశారు.
ఆకుల లలిత కు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం లేదని అధినాయకత్వం సంకేతాలు ఇవ్వడంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న ప్రయత్నాలు చేస్తున్నాడు నర్సిరెడ్డి.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6 ఎమ్మెల్సీ స్థానాల కోసం హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌గౌడ్, తీగల కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, కర్నాటి విద్యాసాగర్, చకిలం అనిల్ కుమార్, పిట్టల రవీందర్, టి.సంతోశ్ కుమార్, ఇనుగాల పెద్దిరెడ్డి, ఎల్.రమణ, ఆకుల లలిత, సీవీరావు, జూపల్లి కృష్ణారావు, జనార్ధన్ ఇలా 17మంది ఎమ్మెల్సీని ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి పొందాక కేబినెట్‌లోనూ చోటు దక్కించుకుని మంత్రి పదవి ఆశిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే, సామాజిక వర్గాల సమీకరణ, రాజకీయ లబ్ధి ఇతర విషయాలను దృష్టి పెట్టుకుని గులాబీ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీల ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఎమ్మెల్సీ దక్కిన మంత్రిపదవి దక్కుతుందా. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ఎవరి అంచనాలకు అందకుండా కేసీఆర్ నిర్ణయం ఉంటుంది ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం దక్కుతుందో.
Also Read : హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో తెరపైకి కొత్తపేర్లు