iDreamPost
iDreamPost
ఐదేళ్ల క్రితం జిల్ తో ఓ మాదిరి హిట్ అందుకున్న యాక్షన్ హీరో గోపి చంద్ దాని తర్వాత సక్సెస్ చవిచూడనే లేదు. ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు క్యు కట్టి పలకరించాయి . ఆరడుగుల బుల్లెట్ ఏకంగా విడుదల కాకుండా ఆగిపోయింది. సౌఖ్యం, గౌతం నందా, ఆక్సిజన్, పంతం, చాణక్య అన్నీ కలిపి గట్టి దెబ్బే వేశాయి. ఇప్పుడు తన ఆశలన్నీ సీటీ మార్ మీదే ఉన్నాయి. సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాక తిరిగి కొనసాగించనున్నారు. దీని తర్వాత తేజ డైరెక్షన్ లో గోపి చంద్ మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
కెరీర్ ప్రారంభంలో హీరోగా సక్సెస్ కాలేని టైంలో జయం, నిజం రూపంలో తనలో బెస్ట్ పెర్ఫార్మార్ ని బయటికి తీసిన తేజతో గోపి తర్వాత మళ్ళీ సినిమా చేయలేదు. విలన్ గా చూపించినా అందులో హీరోలను డామినేట్ చేసే స్థాయిలో పాత్రను డిజైన్ చేయడం గోపీచంద్ కు చాలా హెల్ప్ అయ్యింది. 17 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చబోతోంది. అలిమేలుమంగ వెంకటరమణ అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చేసింది. తేజ అధికారికంగా ధృవీకరించనప్పటికీ దాదాపుగా ఖరారైనట్టే. అయితే గోపీచంద్ కు జోడిగా ఎవరు నటిస్తారనే సస్పెన్స్ మాత్రం ఇంకా వీడటం లేదు. ముందు కీర్తి సురేష్ అన్నారు. కానీ తను చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో డేట్ల సర్దుబాటు కాకపోవచ్చనే టాక్ వచ్చింది.
తాజాగా సాయి పల్లవి పేరు చక్కర్లు కొడుతోంది. తెలుగులో తను ప్రస్తుతం లవ్ స్టోరీ, విరాట పర్వం పూర్తి చేయాల్సి ఉంది. వచ్చిన ప్రతి ఆఫర్ ని తాను ఒప్పుకోవడం లేదు. అందుకే టాలీవుడ్ లో బాగా గ్యాప్ వస్తోంది. కానీ అలిమేలులో పాత్ర చాలా స్కోప్ ఉన్నది కావడంతో ఆలోచనలో ఉన్నట్టు వినికిడి. దీనికి సంబంధించిన క్లారిటీ మరికొద్ది రోజుల్లో రావొచ్చు. టైటిల్ ని బట్టి ఇదేదో సాఫ్ట్ ఎంటర్ టైనర్ అనుకుంటున్నారేమో. ఇది పక్కా యాక్షన్ జానర్ లో ఉంటుందట. కాకపోతే ఊహించని లైన్ తో కథనం ఉంటుందని తెలిసింది. నేనే రాజు నేనే మంత్రితో తిరిగి సక్సెస్ ట్రాక్ లో పడినా సీత రూపంలో డిజాస్టర్ అందుకున్న తేజకు దీని సక్సెస్ చాలా కీలకం. అందులోనూ ఇంత గ్యాప్ తర్వాత గోపిచంద్ తో చేయబోతున్న సినిమా కావడంతో అభిమానుల్లోనూ ప్రత్యేక అంచనాలు ఏర్పడతాయి.