iDreamPost
android-app
ios-app

గరికపాటి చెప్పిన “రొమాంటిక్ ఎమ్మెల్యే” ఎవరో?

  • Published Feb 13, 2020 | 5:39 AM Updated Updated Feb 13, 2020 | 5:39 AM
గరికపాటి చెప్పిన “రొమాంటిక్ ఎమ్మెల్యే” ఎవరో?

గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు వినని తెలుగువారు ఉండొచ్చేమో కానీ ఆయన పేరు తెలియని తెలుగువారు దాదాపుగా ఉండరు. ప్రవచనకర్తగా ఆయనది ప్రత్యేకమై శైలి. విషయాన్ని సూటిగా తక్కువ మాటల్లో అర్థమయ్యేలా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఈ మధ్య గరికపాటి గారు ఒక ప్రవచనం ఇస్తూ ఈ ప్రపంచంలో పనికిరాని వాడు.. పనికిరాని వస్తువు ఏదీ ఉండదని అన్నారు. ఆ టాపిక్ అలానే కొనసాగిస్తూ గతంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన చెప్పారు.

చదువుకు పనికిరాని వాడు ఇంకోదానికి పనికొస్తాడని చెప్తూ గరికపాటి కాకినాడలో ఇంటర్మీడియట్ కాలేజి నిర్వహించిన రోజుల్లో కోపం వచ్చి ఒక విద్యార్ధిని చితక్కొట్టానని చెప్పారు. కారణం ఏంటంటే ఒకడు రోజూ కాలేజి ఎగ్గొట్టి కాకినాడ ఫేమస్ లవర్ తరహాలో తోటలో ఓ అమ్మాయితో తిరుగుతూ ఉండేవాడట. అతనిని మందలించే ఉద్దేశంతో కోట్టారట. అయితే ఆ దెబ్బలతో ఆ కుర్రాడు చదువు మానేశాడట. అతనెవరో హింట్ ఇస్తూ “మీకు నేను పేరు చెప్పను కానీ 175 మంది ఎంఎల్ఏ లలో వాడొకడు” అని ఓ నమస్కారం పెట్టగానే అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. “ఓ ఏడాది క్రితం నాకు కనబడ్డాడు. మీ దెబ్బలకు తట్టుకోలేక పారిపోయాను బాబూ అన్నాడు. ఇప్పుడు చెప్పండి. వాడు బాగుపడ్డాడా.. నేను బాగుపడ్డానా?” అంటూ సభలో ఉన్నవారిని ప్రశ్నించారు.

గురువు ఒక విద్యార్ధిని ఎందుకు కొడతాడో తెలుసు కాబట్టి అతను తన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నాడని, తనపై అమిత ప్రేమ కురిపించాడని అన్నారు. “గురువుగారు.. మీరు అలాగే ఉండండి. మీకేదైనా వస్తే నాకు చెప్పండి. నేను చూసుకుంటా” అన్నాడట. అంతా బాగానే ఉంది కానీ ఆ రొమాంటిక్ ఫ్లాష్ బ్యాక్ ఉన్న ఎంఎల్ఏ ఎవరా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. “175 మందిలో ఒక ఎంఎల్ఎ” అన్నారు కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఎంఎల్ఏ అని తెలుస్తోంది. ఇక గరికపాటి గారు కాలేజి నిర్వహించింది ఆంధ్రాలోనే అయి ఉంటుంది. గరికపాటి గారి స్వస్థలం కాకినాడ కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లోనే కాలేజి నిర్వహించి ఉంటారు. దీన్ని బట్టి ఆ రొమాంటిక్ ఎంఎల్ఏ కాకినాడ లేదా ఆ పరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తే అయి ఉంటాడని అంటున్నారు. అయితే ఎవరు అనేది మాత్రం తెలియడం లేదు. ఎవరైనా కానివ్వండి.. ఇప్పుడు ఆయన హాట్ టాపిక్ అయ్యారు. ఆయన తోట షికార్లు మరింత హాట్ టాపిక్ అయ్యాయి!!

Jojobet GirişmeritbetholiganbetCasibom girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetcasibom girişatombet girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/pokerklascasibomholiganbet girişholiganbet girişMarsbahis GüncelMarsbahis Güncel GirişHoliganbet GirişHoliganbet Güncel GirişMarsbahis GirişMarsbahis Güncel Giriş