iDreamPost
iDreamPost
భారతీయ సినీ పరిశ్రమను డ్రగ్స్ రగడ ఓ ఊపు ఊపేస్తోంది. బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, కన్నడ నటీమణులు సంజన, రాగిణి ద్వివేది ఇప్పటికే అరెస్ట్ అయిన విషయం విదితమే. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు వార్తల్లోకెక్కింది. ఇంకా మరిన్ని పేర్లు రాబోతున్నాయంటూ ప్రచారం జరుగుతున్న వేళ, ఇప్పటికే ఆయా తారలకు సంబంధించిన పాత ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కాక పుట్టించేస్తున్నాయి. రియా చక్రవర్తితో టాలీవుడ్‌కి చెందిన ఓ నటికి సన్నిహిత సంబంధాలున్నాయంటూ గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఎవరా నటి.? అని అంతా ఆరా తీస్తున్నారు. రకుల్ గురించి వేరే చర్చ జరుగుతోంది. రకుల్ కాకుండా ఆ ‘ఆమె’ ఎవరు.? అన్నది హాట్ టాపిక్ ఇక్కడ. ఓ ప్రముఖ సినీ కుటుంబానికి చెందిన నటి.. అంటూ ఆమె గురించిన వివరాల్నీ కొందరు సోషల్ మీడియాలో పొందుపరుస్తున్నారు. దీనికి రాజకీయ రంగు కూడా అలుముతూ, ఫలానా రాజకీయ పార్టీ ‘ఆమె’ గురించి పెదవి విప్పుతుందా.? లేదా.? అనే అనుమానాల్ని తెరపైకి తెస్తుండడం గమనార్హం. ఇదిలా వుంటే, తనపై ఆరోపణలకు సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్ ఇంకా స్పందించలేదు. గతంలో ఆమె ఓ సందర్భంలో డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ఓ మంచి సందేశం కూడా ఇచ్చింది. ‘రకుల్ పేరుని కుట్రపూరితంగా లాగుతున్నారు..’ అని ఆమె మద్దతుదారులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.