Idream media
Idream media
అచ్చెం నాయుడును జైలు తరలించే వ్యవహారంలో వైద్యులు, పోలీసులు పని చేసిన తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. అచ్చెం నాయుడుకు ఫైల్స్ ఆపరేషన్ జరిగింది. అరెస్ట్ తర్వాత ప్రయాణం చేయడంతో గాయం మళ్లీ తిరగబెట్టింది. జూన్ 13వ తేదీన అచ్చెం నాయుడు అరెస్ట్ అయ్యారు. కోర్టు జుడిషియల్ రిమాండ్ విధిస్తూ జీజీహెచ్‌కు తరలించాలని ఆదేశించింది. అరెస్ట్ అయిన రాత్రికే అచ్చెం నాయుడు జీజీహెచ్‌కు వెళ్లారు. గాయం తిరగబెట్టడంతో అయన ఒక వైపుకు తిరిగి పడుకున్నారు. వెనుక భాగం మంచానికి తగలకుండా పడుకున్నారు. ఆ చిత్రాలు బయటకు వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత గాయానికి జీజీహెచ్ వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో కూడా ఆయన ఒక వైపుకు తిరగే పడుకున్నారు. గాయం మానిందని జీజీహెచ్ అధికారులు చెప్పారు.
నిన్న డిశ్ఛార్జి చేసే సమయంలోనూ తనకు కరోనా టెస్ట్ చేయాలనే అచ్చెం నాయుడు కోరారు కానీ అనారోగ్యంగా ఉందని మాత్రం చెప్పలేదు. గాయం మానలేదని చెప్పలేదు. ఇక వైద్యులు ఆయన్ను వీల్‌చైర్‌లో కూర్చొపెట్టి తీసుకొచ్చారు. గాయం మానకపోతే ఆయన అలా కూర్చునే అవకాశమే ఉండదు. గాయం పచ్చిగా ఉంటే నడుచుకుంటూ వచ్చేవారు. కానీ అచ్చెం నాయుడు అలా రాలేదు. ఆయన్ను వీల్ చైర్‌లో వైద్యులు ఎందుకు తీసుకొచ్చారో ఎవరికీ అర్థం కావడంలేదు.
అదే సమయంలో ఆరోగ్యంగా ఉన్న అచ్చెం నాయుడును వైద్యులు డిశ్ఛార్జి చేయగా పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. అయితే ఆయన్ను సాధారణ పోలీసు వాహనంలో కాకుండా అనారోగ్యంతో ఉన్న వారిని తరలించే అంబులెన్స్‌లో ఎందుకు తరలించారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అటు వైద్యులు, ఇటు పోలీసులు వ్యవహరించిన తీరు వల్లనే టీడీపీకి ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం వచ్చిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనను మళ్లీ ఆస్పత్రికి తరలించాలని అచ్చెం నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.