iDreamPost
iDreamPost
ఎంత పేరున్న దర్శకుడి కొడుకైనా సరే ఇండస్ట్రీలో సక్సెస్ దొరికితేనే నిర్మాతలు వెంటపడతారు. లేదంటే కిందామీదా పడాల్సిందే. పరిశ్రమకే పెద్దదిక్కుగా నిలిచిన దాసరి నారాయణరావు గారు తన వారసుడు అరుణ్ కుమార్ ని హీరోగా సెటిల్ చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. కానీ ఎన్నేళ్లు గడిచినా కనీస హిట్టు అని చెప్పుకునే సినిమా లేక మాయమైపోయాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ట్రై చేసినా కూడా ఫలితం దక్కలేదు. కమర్షియల్ డైరెక్టర్ గా గొప్ప ఎత్తులు చూసిన ఏ కోదండరామిరెడ్డి గారి అబ్బాయి వైభవ్ ఇక్కడ నిలవలేక ఫైనల్ గా చిన్న సైజు హీరోగా కోలీవుడ్ లో సెటిలయ్యారు. రాఘవేంద్రరావు అబ్బాయి ప్రకాష్ ది ఇంకా పెద్ద కథ.
Also Read: బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధం
ఇప్పుడీ ప్రస్తావన తేవడానికి కారణం ఉంది. పూరి జగన్నాధ్ దర్శకత్వ వారసత్వాన్ని పుచ్చుకోకపోయినా హీరోగా తన లక్కుని ట్రై చేస్తున్న ఆకాష్ పూరి నిరీక్షణ ఎంతకీ తెగడం లేదు. డెబ్యూ చేసిన ఆంద్రపోరి అడ్రెస్ గల్లంతు కాగా నాన్న గట్టిగా ఖర్చు పెట్టి తీసిన మెహబూబా సైతం ఊసులో లేకుండా పోయింది. మూడో ప్రయత్నం రొమాంటిక్ అంటూ బోల్డ్ గా ఉండే సబ్జెక్టునే తీసుకున్నారు కానీ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా కనీసం దాన్ని ఓటిటిలో రిలీజ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. పోనీ థియేటర్లలో వదులుతారా అంటే ఆ సూచనలు కనిపించడం లేదు. నిన్న ఆకాష్ బర్త్ డే ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు
దీనికన్నా చాలా లేట్ గా మొదలైన చోర్ బజార్ తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ ఇచ్చారు కానీ రొమాంటిక్ తాలూకు న్యూస్ మాత్రం లేదు. ఫైనల్ కాపీ అంత సంతృప్తికరంగా రాలేదని విడుదల చేసినా ఫలితం ఎలా వస్తుందో ముందే ఊహించే ఆపారని ఒక టాక్ ఉంది కానీ బాగున్నా లేకున్నా ముందైతే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి కదా. కొన్నిసార్లు మనకు డౌట్ ఉన్న సినిమాలు గొప్పగా ఆడిన సందర్భాలు లేకపోలేదు. అలాంటప్పుడు రొమాంటిక్ ని ల్యాబులో మగ్గబెడితే లాభం లేదు. పోటీ విపరీతంగా ఉన్న వాతావరణంలో ఆకాష్ ని సెట్ చేయాలంటే పూరి ఇంకా పెద్ద స్కెచ్ వేయాల్సిందే. స్వయంగా బరిలో దిగాల్సిందే
Also Read: ఊహించని కాంబో సెట్టవుతోందా