iDreamPost
android-app
ios-app

సుమ అడ్డాకు మెగాస్టార్ – కారణమేంటంటే ?

  • Published Jan 06, 2023 | 5:52 PM Updated Updated Jan 06, 2023 | 5:58 PM
సుమ అడ్డాకు మెగాస్టార్ – కారణమేంటంటే ?

యాంకర్ సుమ కొత్త టీవీ షో అడ్డా అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇది కూడా గేమ్ షోనే. కాకపోతే బడా సెలబ్రిటీలను తీసుకొచ్చి ఏదో వెరైటీగా నిర్వహించబోతున్నారు. లాంచింగ్ ఎపిసోడ్ కు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని తీసుకురావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కోసం వస్తారేమో అని ఎదురు చూస్తుంటే ఇలా ట్విస్ట్ ఇవ్వడం ఎవరూ ఊహించనిది. నిజానికి మెగాస్టార్ స్టేచర్ కి ఇలాంటి అడ్డా షోలు చాలా చిన్నవి. కానీ వాల్తేరు వీరయ్య ప్రమోషన్ల కోసం ఏ చిన్న అవకాశాన్ని విడవకూడదని డిసైడ్ అయిన చిరు ఆ కారణంగానే సుమకు ఎస్ చెప్పినట్టు వినికిడి. ఆల్రెడీ దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తయిపోయింది

వీటి తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తమ హీరో ఇలాంటి వాటికి రావడం పట్ల అభిమానుల్లో మిశ్రమ అభిప్రాయాలు ఏర్పడతాయి. ఇదే సుమకు ఇంటర్వ్యూ ఇస్తే ఇబ్బంది లేదు. అలా కాకుండా సిల్లీ ప్రశ్నలు, ఆటలతో యంగ్ స్టర్స్ ని టార్గెట్ చేసే ఇలాంటి వాటిలో పాల్గొనడం ఆయన రేంజ్ కాదని వాళ్ళ అభిప్రాయం. దీనికి ఇంకో కోణం ఉంది. ఈ అడ్డా ఎలా ఉంటుందో క్లారిటీ లేదు. కేవలం క్యాష్ లాంటి గేమ్ షోని ఆధారంగా చేసుకుని ఇది కూడా అలాగే ఉంటుందనే అంచనా తప్ప ఫుల్ ఎపిసోడ్ చూశాకే స్పష్టత వస్తుంది. అలీ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ లాంటి సీనియర్ కమెడియన్స్ కూడా త్వరలో భాగం కానున్నారు

సంక్రాంతి రేస్ లో గట్టి పోటీకి సిద్ధపడ్డ వాల్తేరు వీరయ్య పబ్లిసిటీ విషయంలో చాలా కష్టపడుతోంది. ఇప్పటికే బోలెడు ఇంటర్వ్యూలు, ఒక ప్రెస్ మీట్ అయ్యాయి. ఎల్లుండి వైజాగ్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. దీనికి ఒక రోజు ముందే ట్రైలర్ వచ్చేస్తుంది. బాలకృష్ణ వీరసింహారెడ్డితో నువ్వా నేనా అని తలపడాల్సి రావడంతో ప్రమోషన్ భారం చిరు తన భుజాల మీద వేసుకున్నారు. ఆచార్య తాలూకు గాయం ఇంకా పచ్చిగానే ఉంది. గాడ్ ఫాదర్ మొదటి మూడు నాలుగు రోజులు హడావిడి తప్ప ఫైనల్ గా యావరేజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్యతో హిట్టు ఖచ్చితంగా కొట్టాల్సిన ఒత్తిడిలో మెగాస్టార్ ఉన్న మాట వాస్తవం

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş