Idream media
Idream media
పశ్చిమ బెంగాల్ లో అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత శతృత్వం పెరిగిపోతోంది. ఇప్పటికే ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో మూడుకు మూడు సీట్లను సాధించి బిజేపికి, తృణమూల్ షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పార్టీల మధ్య ఘర్షణలు ఆ రాష్ట్రంలో భయంకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. హిందుత్వం, హిందూయిజం ఇప్పుుడు పశ్చిమ బెంగాల్ లో దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటుందని బిజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఉపఎన్నికల్లో గెలిచిన సంబరంలో తృణమూల్ నేతలు బీజేపీ కార్యకర్తల పై దాడులకు దిగుతున్నారని పశ్చిమబెంగాల్ బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
సోమవారం కోల్ కత లోని మజీద్ తలాబ్ ఏరియాలో ఆర్సెస్ కార్యకర్త బిర్ బహదూర్ సింగ్ పై దుండగులు వెనక భాగంలో కాల్చి వెల్లిపోయారు. వెంటనే అక్కడ ఉన్న హాస్పిటల్ లో అతన్ని చేర్పించారు. స్థానిక పాఠశాలలో విద్యార్థులకు టీచింగ్ చెప్పడానికి వెళ్లే సమయంలో ఈదాడి జరిగినట్టు ఈ ఘటన పై దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు. తృణమూల్ పార్టీ వారే తమ కార్యకర్తపై దాడి చేశారంటూ బీజేపి నాయకులు ఆరోపిస్తున్నారు. గాయపడిన వ్యక్తి వెంటనే కోలుకోవాలని బిజేపి నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో హిందువులపై దాడులు ఎక్కువగా పెరుగుతున్నాయని రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ట్వీట్ చేశారు. దుండగుల దాడిలో గాయపడిన బహదూర్ సింగ్ త్వరగా కోలువాలని ఆయన ఆకాంక్షించారు.
2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీకి బిజేపి షాక్ ఇచ్చింది. 42 లోక్ సభ స్థానాల్లో 18 స్థానాలను బిజేపీ గెలిచింది. దీంతో బీజేపీకి, తృణముల్ కు మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మూడు శాసనసభ స్థానాలకు ఈ వారం జరిగిన అప్ ఎన్నికల్లో మొత్తం మూడు స్థానాలను తృణముల్ గెలిచింది. మరో రెండు సంవత్సరాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో పట్టుకోసం రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్బంగానే రెండు పార్టీల కార్యకర్తల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. రోజురోజుకూ ఈ ఘర్షణలు జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.