iDreamPost
android-app
ios-app

ఫిలిప్పీన్స్ కు తొలి స్వర్ణం సాధించిన దియాజ్!

ఫిలిప్పీన్స్ కు తొలి స్వర్ణం సాధించిన దియాజ్!

ఆమె సుమారు ఏడాదిన్నర ఇంటికి రాలేదు… ఎయిర్ ఫోర్స్ కెరియర్, కుటుంబం, కళాశాల, స్నేహితులు, ఇష్టాలు, అభిరుచులు అన్నీ వదిలేసింది. ఒక చిన్న ద్వీపంలో సాధన చేసింది. కరోనా సమయంలో బయటి ప్రపంచంతో తనకేం సంబంధం లేకుండా శిక్షణ లో మునిగిపోయింది. తన దేశం కల కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. చివరకు ఆ చిన్న సమూహాల ద్వీపాలతో కూడిన ఆ దేశానికి ఒలింపిక్ చరిత్రలో మొదటి బంగారు పతకాన్ని తీసుకొచ్చింది. పతకం మెడలో పడగానే ఆమె కళ్ళు నిండా సంద్రమే.. ఉప్పునీటి కెరటాల్లా వెక్కి వెక్కి వస్తున్న ఉద్వేగపూరిత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆమె తన దుస్తులపై ఉన్న దేశపు జెండాను చూపిస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకుంది. 90 ఏళ్ల ఒలింపిక్ చరిత్రలో ఫిలిప్పీన్స్ మొదటి సారి బంగారు పతకం సాధించింది. 55 కిలోల మహిళలు వెయిట్ లిఫ్టింగ్ లో ఆ దేశపు క్రీడాకారిణి హిడిలిక్ డియాజ్ స్వర్ణం సాధించడంతో ఆ దేశంలో ఇప్పుడు సంబరాల్లో మునిగిపోయింది. గత రియో ఒలంపిక్స్ లోనూ రజత పతకం సాధించి, ఫిలిప్పీన్స్ కు 20 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం అందించిన ఘనత నూ దియాజ్ సొంతం చేసుకోవడం విశేషం.

రియో ఒలింపిక్స్ లో 53 కేజీల విభాగంలో పోటీ పడిన ఆమె కేవలం చివర్లో తడబడింది. 118 కేజీ ల బరువును చివరి దశలో ఎత్తలేక రజతం తో సరిపెట్టుకుంది. దాని తర్వాత ఆమె ఫిలిప్పీన్స్ దేశానికి ఆమె క్రీడా అంబాసిడర్ అయింది. రియో ఒలంపిక్స్ తర్వాత ఆమె తప్పిదలను మొత్తం సమీక్షించుకున్నారు. ఆమెకు చైనీస్ సైనిక కోచ్ గువ తోడు కావడంతో ఆమె తీరును మొత్తం పాజిటివ్ గా మార్చాడు. పక్కాగా బరువులు ఎత్తే కొత్త మెలుకువలు నేర్పాడు. ఫలితంగా ఆమె రియో ఒలంపిక్స్ కు ఏడాదిన్నర ముందుగానే సన్నద్దత మొదలు పెట్టింది. ఫలితంగా అద్భుతంగా రాణించి దేశానికీ బంగారు పతకాన్ని తీసుకొచ్చింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిన చైనాయేతర దేశం గా ఫిలిప్పీన్స్ నిలిచింది.

పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో 7 వేల దీవుల కలయిక ఫిలిప్పీన్స్. ద్విపకల్పం అయినప్పటికీ జనాభా మాత్రం అధికం. పేద దేశం. దీంతో పాటు చైనాతో నిత్యం తలనొప్పులు తప్పవు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సైన్యంలో పనిచేయాలి. దీంతో అవంతరాలు మధ్యనే దియాజ్ ప్రాక్టీస్ సాగింది. ప్రస్తుతం ఆమె దేశ ఎయిర్ ఫోర్స్ ఈ విభాగంలో పనిచేస్తున్నారు. దియాజ్ స్నాచ్ లో 97 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 119 కేజీలు, 124, 127 కేజీల లను ఎత్త గలిగారు. ఇది ఆమె గత రికార్డు కంటే అధికం.

వెయిట్ లిఫ్టింగ్ చాలా కఠినమైన క్రీడ. శిక్షణతో పాటు డైటింగ్ చాలా అవసరం. దీనికి దియాజ్ చాలా శ్రమ పడ్డారు. రజతం సాధించిన తర్వాత లోపాలను అధిగమించడానికి ఆమె నిరంతర శ్రమ చేశారు. ఈ రోజుల్లో సుమారు 16 గంటల వరకూ శిక్షణ తీసుకున్న రోజులు ఉన్నాయంటే ఆమె శ్రమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 2018లో ఆమె వ్యక్తిగత కోచ్ గా గువ వచ్చారు. ఆయన 2012 లో బంగారు పతకం సాధించిన చైనా టీంకు ప్రధాన  కోచ్ గా వ్యవహరించారు. ఆయన వచ్చాక దియాజ్ మానసిక పరిస్థితిని అంచనా వేశారు. ప్రత్యర్థుల బలాలు బలహీనతలను అంచనా వేయగలిగారు. దింతో పాటు ఆమెను టోక్యో ఒలంపిక్స్ సన్నద్ధత కోసం ఏడాదిన్నర ముందు నుంచే కఠోర శిక్షణ మొదలు పెట్టారు. దీంతో దియాజ్ గెలుపును నెరవేర్చడంలో సఫలీకృతులయ్యారు.