iDreamPost
android-app
ios-app

వకీల్ సాబ్ నుంచి కోరుకున్నది ఇదే

  • Published Jan 15, 2021 | 6:13 AM Updated Updated Jan 15, 2021 | 6:13 AM
వకీల్ సాబ్ నుంచి కోరుకున్నది ఇదే

నిన్న సాయంత్రం విడుదలైన వకీల్ సాబ్ టీజర్ ఇంకా ఇరవై నాలుగు గంటలు గడవక ముందే సంచలనాలకు వేదిక మారుతోంది. పవన్ లుక్ కు సంబంధించి పోస్టర్స్ రూపంలో గతంలోనే క్లారిటీ వచ్చినప్పటికీ సీన్స్ లో ఎలా ఉంటాడన్న పూర్తి స్పష్టత నిన్న వీడియోలో ఇచ్చేశారు. లాయర్ గా నటిస్తున్నా మాస్ కి సైతం కిక్కిచ్చేలా పవర్ స్టార్ మ్యానరిజంస్ చూసి అభిమానులు తెగమురిసిపోతున్నారు. సోషల్ మీడియాలో ఇంకా ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. కేవలం నిమిషంలోపు టీజర్ కే ఇంత మైమరిచిపోతే ట్రైలర్ వచ్చాక ఇంకెంత రచ్చ ఉంటుందోనని అప్పుడే అంచనాల కోటలు కట్టేస్తున్నారు. హైప్ కూడా అమాంతం పెరిగింది.

నిజానికి పింక్ రీమేక్ అని ప్రకటించినప్పుడు అమితాబ్ లాంటి లేట్ ఏజ్ హీరో చేసిన క్యారెక్టర్ పవన్ కి సూటవుతుందా అని వచ్చిన అనుమానాలే ఎక్కువ. తమిళ్ లో కూడా అజిత్ ఇంచుమించు బాగా వయసైన లుక్ లో కనిపిస్తాడు. రెండింట్లో తెల్లగెడ్డం ఉంటుంది. కానీ అలా చేస్తే పవన్ ని మనవాళ్ళు చూడలేరు కాబట్టి దాని బదులు క్లీన్ షేవ్ ని సెట్ చేయడంతో ఇప్పుడు పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాడు. అయితే సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామాగా నడిచే వకీల్ సాబ్ లో కమర్షియల్ అంశాలకు లోటు లేకుండా చూసుకున్నట్టు కనిపిస్తోంది. ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు అన్నీ పుష్కలంగా జొప్పించారు.

సో మాస్ ఆడియన్స్ మీటర్ లో వకీల్ సాబ్ లో అన్నీ ఉన్నట్టే. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాపీ అంటూ కామెంట్స్ రావడం హాట్ టాపిక్ గా మారింది. మాస్టర్ టీజర్ లోదే ఆటుఇటుగా వాడారని ట్రోలింగ్ జరిగింది. కథకు కేంద్రబిందువుగా నిలిచే అసలైన ఆ ముగ్గురు అమ్మాయిల పాత్రలను చూపించలేదనే విమర్శలు వచ్చినప్పటికీ మెట్రో ట్రైన్ లో జరిగే ఫైట్ లో వాళ్ళను పొందుపరిచిన విషయం చాలా మంది గమనించలేదు. ఫాన్స్ స్క్రీన్ షాట్లు పంచుకున్నారు. వకీల్ సాబ్ విడుదల ఎప్పుడనేది మాత్రం ప్రకటించలేదు. వేసవి అనేది ఫిక్స్ కానీ మార్చ్ లోనా లేక ఏప్రిల్ కు వెళ్తారా అనేది ఇంకో నెల రోజుల్లో డిసైడ్ చేస్తారు.

Teaser Link @ http://bit.ly/2KgZFu4