ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మల్లపాలెం గ్రామంలో ఓ టీడీపీ కార్యకర్త వీఆర్వోపైనే దాడికి చేసాడు. తాము చెప్పిన పనులు చేయాల్సిందే అంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. ఓటరు గుర్తింపు కార్డులకి ఆధార్ అనుసంధానం చేసే పనిలో ఉన్న వీఆర్వో వెంకటేశ్వర్లుపై గ్రామస్తుల సమక్షంలోనే టీడీపీ నాయకుడు బాలూ నాయక్ విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.