iDreamPost
android-app
ios-app

Viral news విమానంలో పురిటి నొప్పులు, ఏ పేరు పెట్టారో తెలుసా ?

  • Published May 22, 2022 | 10:29 AM Updated Updated May 22, 2022 | 10:29 AM
Viral news విమానంలో పురిటి నొప్పులు, ఏ పేరు పెట్టారో తెలుసా ?

నిండు గ‌ర్భిణి, ప్ర‌స‌వానికి ఇంకా స‌మ‌యం ఉంది. అందుకే విమానమెక్కింది. ఆమెకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కాని ఆత‌ర్వాతే పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యాయి. మ‌రి ఏం జ‌రిగింది?

అమెరికాలో ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్ చెందిన ఓ విమానం డెన్వర్ నుంచి ఒర్లాండో బయలుదేరింది. ఇందులో షకేరియ మార్టిన్ అనే మహిళా ప్రయాణికురాలు ఉంది. ఈమె నిండు గర్భిణీ. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఆమెకు పురిటి నొప్పులు స్ట్రాట్ అయ్యాయి. ఏం చేయాలి? ప్ర‌యాణీకుల్లో ఎవ‌రైనా డాక్ట‌ర్లు ఉన్నారా? ఎంక్వైరీ చేశారు. కానిఎవ‌రూ లేదు. విమాన సిబ్బందిలో ఒకరైన డయానా గిరాల్దో దైర్యం చేసి ముందుకొచ్చారు. షకేరియాను బాత్రూంలోకి తీసుకెళ్ళింది. అందులోనే సుఖ ప్రసవం అయ్యింది.
ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా ప్రసవానికి సహకరించిన దయనాను అందరూ మెచ్చుకున్నారు. గాల్లో ఉండగా పుట్టిన శిశువుకు, స్కై అని పేరు పెట్టారు. విమానం లాండ్ అయిన తర్వాత విమానాశ్రయ అధికారులు తల్లీ, బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఇద్ద‌రూ ఆరోగ్యంగా ఉన్నారు.