iDreamPost
android-app
ios-app

మార్పు కోసం తుపాకీ పట్టిన డాక్టర్ కామ్రేడ్

  • Published Dec 14, 2020 | 5:57 AM Updated Updated Dec 14, 2020 | 5:57 AM
మార్పు కోసం తుపాకీ పట్టిన డాక్టర్ కామ్రేడ్

దగ్గుబాటి రానా, సాయి పల్లవి ఫస్ట్ టైం కాంబోలో రూపొందుతున్న విరాట పర్వం టీజర్ ని ఈ రోజు హీరో పుట్టినరోజు సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వి సినిమా సంస్థలు విడుదల చేశాయి. నీది నాది ఒకే కథతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒకప్పుడు ఉధృతంగా సాగిన నక్సలైట్ ఉద్యమాన్ని నేపధ్యంగా తీసుకుని 90 దశకంలో జరిగినట్టుగా ఈ కథను చూపబోతున్నారు. నేనే రాజు నేనే మంత్రి తర్వాత ఇంత గ్యాప్ తీసుకుని రానా సోలో హీరోగా చేసిన సినిమాల్లో అరణ్య తర్వాత ఇది రెండోది.

ఇక వీడియో విషయానికి వస్తే కథ 1990 బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని ముందే చెప్పేశారు. ఉన్నత విద్యావంతుడైన డాక్టర్ రవిశంకర్ ఎందుకు కామ్రేడ్ రవన్నగా మారాల్సి వచ్చింది, దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి, ఎందుకు ఈ దేశానికి ప్రశ్నగా మిగిలాడు, తన ప్రయాణాన్ని ఎందుకు నెత్తుటి ధారలలో నడిపించాల్సి వచ్చింది లాంటి ఎన్నో సందేహాలకు సమాధానమే విరాట పర్వం. ఈ టైటిలే వెనుక పెద్ద కథే ఉన్నట్టు కనిపిస్తోంది. టీజర్ నిమిషమే ఉన్నప్పటికీ ఆలోచింపజేసే విధంగా విజువల్స్ ని పొందుపరిచారు. అప్పటి దారుణ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించారు.

నక్సలైట్ల ప్రభావం వర్తమానంలో తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ ఒకప్పుడు ఇది శాసన వ్యవస్థను సవాలు చేసే స్థాయికి ఎదిగింది. సమానత్వం కోసం, సమాజం మేలు కోసం ఎందరో యువతీయువకులు సమిధలుగా మరి బలిదానం ఇచ్చారు. ఈ విరాట పర్వంలో అవన్నీ స్పృశించబోతున్నారు. అంతే కాదు విరాటపర్వంలో విప్లవం కోరిన త్యాగం వెనుక ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. అయితే రానాను తప్ప ఈ టీజర్ లో ఇంకెవరిని రివీల్ చేయలేదు. సురేష్ బొబ్బిలి నేపధ్య సంగీతం చక్క

Link Here @ https://bit.ly/37hWniZ

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobetcasibom girişholiganbet giriş