iDreamPost
android-app
ios-app

హీట్ పుట్టిస్తున్న విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్స్.. టీడీపీ కుదేలు..!

హీట్ పుట్టిస్తున్న విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్స్.. టీడీపీ కుదేలు..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయ‌కుల త‌ప్పుల‌ను ఎత్తి చూపుతూ… ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. రోజుకో ఇష్యూ తెర‌పైకి తెస్తూ.. టీడీపీ నాయ‌కుల‌కు నిద్ర లేకుండా చేస్తున్నారు. దానికి ఏం స‌మాధానం చెప్పాలో తెలియ‌క తెలుగుదేశం నాయ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. గ‌త మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీ, నాయ‌కుల‌పై వ‌రుస ట్వీట్ లు చేస్తూ.. సోష‌ల్ మీడియాలో రాజ‌కీయ వేడి పుట్టిస్తున్నారు. వాటిని ఓ సారి ప‌రిశీలిస్తే…

పేద‌ల‌పై ప‌గెందుకో..

పేదలందరికీ ఇచ్చే ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుని పగ సాధించడమే కాకుండా, దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు తెలుగుదొంగల పార్టీ నిరసన దీక్షలకు దిగుతుందట అంటూ విజయసాయి రెడ్డి గురువారం విమర్శలు గుప్పించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. టీడీపీ నాయకులు పట్టాల పంపిణీని వాయిదా వేయకుండా తక్షణమే ఇవ్వాలనే డిమాండు చేస్తున్నారని చెప్పారు. నాడు అడ్డుకున్న వాళ్లే నేడు ఇవ్వాలని అడుగుతూ సిగ్గు విడిచిన రాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.

నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పంపిణీ చేయడం లేదని పచ్చ పార్టీ నేతలు ఆందోళనకు దిగడంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కడిగిపారేశారని చెప్పారు. చంద్రబాబు ఎక్కడ హర్ట్ అవుతాడోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సైలెంట్​ అయ్యారని తెలిపారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు సిద్ధమైన దగ్గరి నుంచి ‘విజనరీ’ చీకటి మిత్రులకు టెన్షన్​ పట్టుకుందని విమర్శించారు. ఐదేళ్లుగా అయ్యతో కలిసి ఐదు లక్షల కోట్ల రూపాయలు తిన్న గిత్త ఐదు నెలలుగా నోరు కట్టుకుని ఐదు కేజీలు తగ్గిందని మరో ట్వీట్​ చేశారు. దాని పేరు మాత్రం తనను అడగొద్దని కోరారు. ఆరోగ్య శ్రీ ద్వారా కరోనా ట్రీట్​మెంట్​ను ఉచితంగా అందిస్తున్న ఏకైక సర్కారు ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డిదేనని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని నివారించేందుకు విధివిధానాలను కూడా ఏపీ ప్రభుత్వం జారీ చేసిందని వెల్లడించారు.

కొల్లును మ‌రిచిపోయావా చిట్టీ…

‘తాను ట్వీట్ చేస్తే వైఎస్సార్‌సీపీ వణికి పోతుందన్నాడు చిట్టినాయుడు. జనం మాత్రం టిక్ టాక్ లేని లోటు తీరుస్తున్నాడంటున్నారు. తిండి ఖర్చుల గురించి ఆయన మాటలు విని నవ్వుకుంటున్నారు. ఏం చేసినా చిట్టినాయుడు స్టైలే వేరు. అన్నట్లు కొల్లును పరామర్శించావా ? మర్చిపోయావా చిటీ..! అంటూ శుక్ర‌వారం లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కాగా మరో ట్వీట్‌లో.. పేదలందరికీ ఇచ్చే ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో టీడీపీ చేస్త్నున్న కుటిల ప్రయత్నాలను ఆపాలని హితువు పలికారు. ‘ఇల్లులేని కుటుంబం ఆంధ్రాలో ఉండకూడదన్నదే జగన్ గారి ఆలోచన. పేదలకిచ్చే 30 లక్షల ఇళ్ల స్థలాల విషయంలో సంకుచిత ఆలోచనలు ఆపండి. ఒకసారి ఎక్కువ రేటుకు కొన్నారంటారు. మరోసారి ఊరు చివర అంటారు. అబద్ధపు ప్రచారాలతో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారు తెలుగుదేశం పచ్చనేతలు’ అంటూ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు.

తాజాగా.. టీడీపీ దిమ్మ‌తిరిగే ట్వీట్

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడిని ఉద్దేశించి నేరుగా విజ‌య‌సాయి రెడ్డి చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. ‘చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు. వర్తమానం లేదు. భవిష్యత్తు లేదు. తనపై తనే నమ్మకం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు ఏం ధైర్యం ఇవ్వగలడు. తప్పులను సవరించుకునే బదులు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రం నలుచెరుగులా ఏలిన పార్టీని నాలుగు గ్రామాలకు పరిమితం చేశాడు’ అంటూ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఎద్దేవా చేశారు.

‘లచ్చల్ లచ్చల్ ఇళ్లు తామే నిర్మించేశాం – పంపిణీ మర్చిపోయాం అంటున్నాడు చంద్రబాబు. నీవు ఇళ్లు నిర్మిస్తే పచ్చ బ్యాచ్ కు పంచకుండా ఉంటావా బాబూ? లేని నగరాన్నే గ్రాఫిక్స్‌లో సృష్టించి వాటాలు పంచినోడివి. బొంకరా బొంకరా బాబు అంటే కరోనా వ్యాక్సిన్ తానే తయారు చేశానన్నాడంట’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే.. మరో ట్వీట్‌లో దేవినేని ఉమాపై విరుచుకుపడ్డారు. ‘వాస్తవాలు చెబుతుంటే ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టులు చేస్తోందట. ఫ్రస్టేషన్లో ఏం మాట్లాడేదీ తెలియట్లేదు ఉమకి. ఇరిగేషన్ ప్రాజెక్టుల కుంభకోణాలు బయటకు వస్తే నువ్వూ ఊచలు లెక్కపెట్టాల్సిందే. మాజీ సీఎం, మాజీ మంత్రులైనా ఎవరూ తప్పించుకోలేరు. దోచుకోవడాలు పంచుకోవటాలు మీతోనే పోయాయి’ అంటూ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.