iDreamPost
android-app
ios-app

Liger trailer విజయ్ దేవరకొండ త‌న స్టైల్, స్వాగ్‌ని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లాడు

  • Published Jul 21, 2022 | 12:11 PM Updated Updated Jul 21, 2022 | 12:13 PM
Liger trailer విజయ్ దేవరకొండ త‌న స్టైల్, స్వాగ్‌ని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లాడు

ట్రైలర్ ఎంత విజువల్ ట్రీట్‌గా ఉందంటే, రిలీజ్ ఫంక్ష‌న్ లో క‌ర‌ణ్ జోహార్ అదిరిపోయాడు. బాగా ఎగ్జైట్ అయిపోయాడు. ఈ సినిమా ట్రైలర్ సౌత్ లాంగ్వేజెస్, హిందీలో విడుదలైంది. పాజిటివ్ ఇంప్రెష‌న్ కొట్టేసింది. ట్రైలర్ రమ్యకృష్ణతో మొదలవుతుంది, విజయ్ దేవరకొండను పరిచయం చేస్తూ, అతనికి లైగర్ అని పేరు పెట్టడానికి గల కారణం, “నా కొడుకు సింహం మరియు పులికి పుట్టిన సంకరజాతి” అని చెబుతుంది. విజయ్ పర్ఫెక్ట్ లైగర్ గా, ప్రతి ఫ్రేమ్‌లో నిరూపించాడు, కాదు బాలీవుడ్ దండ‌యాత్ర‌ను మొద‌లుపెట్టాడు..

లిగర్ కథను ట్రైల‌ర్ దాయ‌లేదు. దారిలో అన్ని అడ్డంకులున్నా, భారతదేశం త‌రుపున‌ MMA టైటిల్‌ను గెలుచుకోవడానికి ప్రయత్నించే ఒక చాయ్‌వాలా అద్భుతమైన ప్రయాణమే లైగ‌ర్. అతని లేడీ లవ్‌గా నటించిన అనన్య పాండే, అతనిని మోసం చేస్తుంది. ఇక‌ విజయ్ న‌త్తితో కన్విన్స్‌గా కనిపిస్తాడు. సినిమాలో హీరో ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో న‌త్తికూడా ఒక‌టే. ఇదో ఎమోష‌న‌ల్ రోల‌ర్ కోస్ట‌ర్ జ‌ర్నీ. ఫుల్ ఆఫ్ ఎమోష‌న్. ఒక సీన్ లో లైగ‌ర్ త‌ల్లి, కాలెత్తి రౌడీని తంతుంది. ఒన్లీ పూరి మాత్ర‌మే తీసే సీన్స్ తో ట్రైల‌ర్ నిండిపోయింది. చివ‌ర్లో లెజెండ్ మైక్ టైసన్ కూడా స్టైలిష్ గా పూరీ భాష‌లోనే మాట్లాడతాడు. విజ‌య్ తో టైస‌న్ గొడ‌వ‌ను చూడాల్సిందే “నేను ఫైటర్‌ని” అని విజయ్ చెబితే, టైసన్ సమాధానంగా, “నువ్వు ఫైటర్ అయితే, నేను ఏమిటిష‌ అని అంటాడు. ఇక‌, టైసన్ కిల్లర్ లుక్, చివ‌ర్ల‌లో న‌వ్వే నవ్వు, ట్రైల‌ర్ కి ప‌ర్ ఫెక్ట్ ఎండింగ్.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet