iDreamPost
android-app
ios-app

టార్గెట్ పెండింగ్ – వకీల్ మొదటివారం వసూళ్లు

  • Published Apr 16, 2021 | 12:50 PM Updated Updated Apr 16, 2021 | 12:50 PM
టార్గెట్ పెండింగ్ – వకీల్ మొదటివారం వసూళ్లు

సరైన టైం చూసుకుని ఎలాంటి పోటీ లేకుండా బరిలో దిగిన పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ అంచనాలకు తగ్గట్టే మొదటి వారం వసూళ్ల వర్షం కురిపించేసింది. లాంగ్ వీకెండ్ కి తోడు ఉగాది పండగ కూడా కలిసిరావడంతో కరోనా సెకండ్ వేవ్ భయాలు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. ముఖ్యంగా మెగా ఫ్యాన్ బేస్ బలంగా ఉండే కొన్ని బిసి సెంటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్లు కళకళలాడాయి. అయితే నైజామ్ తో సహా పలు కీలక పాత్రల్లో గత రెండు రోజులుగా గ్రాఫ్ లో చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉండటం ట్రేడ్ ని టెన్షన్ పెడుతోంది. ఫ్యామిలీస్ ఇంకా బలంగా వస్తారనే నమ్మకంతో ఉన్నారు పంపిణిదారులు.

మొత్తం ఏడు రోజులకు గాను 78 కోట్ల 60 లక్షల షేర్ రాబట్టిన వకీల్ సాబ్ ఇంకా బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి సుమారుగా పదిహేను కోట్ల దాకా రాబట్టాలి. అంటే ఒక మీడియం బడ్జెట్ సినిమా సూపర్ హిట్ అయితే ఫైనల్ రన్ లో వచ్చే మొత్తంతో ఇది సమానం. కానీ ప్రాక్టికల్ గా ఇది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి. పరిణామాల దృష్ట్యా ఇప్పటికే పలుచోట్ల థియేటర్లు తాత్కాలికంగా మూతబడ్డాయి. మరోవైపు ఇంతకు ముందు ప్రకటించిన భారీ సినిమాల డేట్లన్నీ ఒక్కొక్కటిగా పోస్ట్ పోన్ అవుతున్నాయి. పోనీ కొత్తవేవైనా ప్రకటిస్తున్నారా అంటే అదీ లేదు. అఫీషియల్ కాదు కానీ అందించిన సమాచారం మేరకు లెక్కలు ఈ విధంగా ఉన్నాయి

ఏరియా వారి మొదటి వారం వసూళ్లు :

ఏరియా  షేర్ 
నైజాం  22.40cr
సీడెడ్  11.70cr
ఉత్తరాంధ్ర  10.60cr
గుంటూరు  6.63cr
క్రిష్ణ  4.53cr
ఈస్ట్ గోదావరి  5.75cr
వెస్ట్ గోదావరి  6.65cr
నెల్లూరు  3.06cr
ఆంధ్ర+తెలంగాణా  71.32cr
రెస్ట్ అఫ్ ఇండియా 3.52cr
ఓవర్సీస్ 3.76cr
ప్రపంచవ్యాప్తంగా 78.60cr

టార్గెట్ ఇంకా భారీగానే ఉంది. ఇంకో రెండు వారాల దాకా చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేకపోవడం వకీల్ సాబ్ కు ఉన్న అతి పెద్ద సానుకూలాంశం. దీన్ని ఎంత మేరకు వాడుకుంటుందో వేచి చూడాలి. స్క్రీన్లు దాదాపుగా భారీ ఎత్తున రెండో వారం కూడా కొనసాగుతున్నాయి. జనానికి వేరే రెండో ఆప్షన్ కూడా లేకుండా పోయింది. ఇంకో 15 కోట్ల దాకా షేర్ అంటే మాటలు కాదు. సగం హాళ్లు నిండేలా పవన్ మేనేజ్ చేయగలిగినా చాలు ఇంకో పది రోజుల్లోపే మొత్తం తిరిగి వచ్చేస్తుంది. మరి ఇప్పటికే దూకుడు తగ్గిన వకీల్ సాబ్ ఆ డేంజర్ మార్క్ ని దాటేసి బయ్యర్లకే లాభాలు మిగులుస్తాడో లేదో వేచి చూడాలి