iDreamPost
android-app
ios-app

యూఎస్‌ ఓపెన్‌ విజేత నవోమి ఒసాకా

యూఎస్‌ ఓపెన్‌ విజేత నవోమి ఒసాకా

జపాన్‌కు చెందిన నవోమీ ఒసాకా బెలారస్‌కు చెందిన విక్టోరియా అజెరెంకాపై విజయం సాధించి యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇది ఆమె ఖాతాలో రెండో యూఎస్‌ ఓపెన్‌ కాగా గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకుంది.

విక్టోరియా అజెరెంకాపై తొలి సెట్‌లో 1-6 తో గెలుచుకున్నా నవోమి ఒసాకా వెనుకడుగు వేయలేదు. రెండో సెట్‌ నుండి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఒసాకా 6-3,6-3 తో వరుస సెట్లలో విజయం సాధించి తన ఖాతాలో రెండో యుఎస్ ఓపెన్ టైటిల్ వేసుకుంది. గతంలో అంటే 2018 లో తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించగా తిరిగి 2020 లో విజయం సాధించడం విశేషం.