iDreamPost
android-app
ios-app

స్టార్ వారసుడితో ‘ఉప్పెన’ రీమేక్ ?

  • Published Apr 22, 2020 | 8:44 AM Updated Updated Apr 22, 2020 | 8:44 AM
స్టార్ వారసుడితో  ‘ఉప్పెన’ రీమేక్ ?

అదేంటి ఉప్పెన ఇంకా రిలీజే కాలేదు అప్పుడే రీమేక్ న్యూస్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా. విషయం వేరే ఉంది లెండి. మెగా మేనల్లుడు కం సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా డెబ్యు డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన వాస్తవానికి ఏప్రిల్ 2న విడుదల కావాల్సింది. కరోనా వల్ల ఇప్పటికీ ఫిక్స్ కాని డేట్ కి పోస్ట్ పోన్ అయ్యింది. తమిళ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి విలన్ గా చాలా కీలకమైన పాత్ర పోషించిన ఉప్పెనను అప్పుడే కోలీవుడ్ లో రీమేక్ చేసే దిశగా చర్చలు మొదలయ్యాయట. దీని వెనుక మరో ఇంటరెస్టింగ్ న్యూస్ కూడా ఉంది.

తమిళనాట తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ని హీరోగా పరిచయం చేయడానికి ఉప్పెననే ఎంచుకోబోతున్నట్టుగా తాజాగా వచ్చిన హాట్ అప్ డేట్. మాస్టర్ లో విజయ్ తో కలిసి నటించిన విజయ్ సేతుపతి ఉప్పెన కథ గురించి అవుట్ ఫుట్ గురించి గొప్పగా చెప్పడంతో విజయ్ ఎగ్జైట్ అయిపోయి అంగీకారం తెలిపినట్టుగా తెలిసింది. ఫలితం తేలకముందే ఇలా క్రేజీ ఆఫర్ రావడం విశేషమే. ప్రస్తుతం సంజయ్ ఫిలిం మేకింగ్ అండ్ యాక్టింగ్ కోర్స్ కోసం కెనడాలో ఉన్నాడు. కరోనా తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆపేయడంతో ఇండియాకు వద్దామనుకున్నా రాలేకపోయాడు. ఇక్కడికి చేరుకోగానే స్క్రీన్ టెస్ట్ చేసి ఫైనల్ చేయబోతున్నారట.

నిర్మాతలుగా విజయ్ సేతుపతితో పాటు ఒరిజినల్ వెర్షన్ తీసిన మైత్రి సంస్థ భాగస్వామ్యం వహించే అవకాశం ఉంది. సంజయ్ మీద అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ కొడుకు కాబట్టి వాళ్ళ నుంచి వెల్కమ్ చాలా గ్రాండ్ గా ఉంటుంది. మరి ఉప్పెన మీద అంత మనసు పడ్డారు అంటే ఖచ్చితంగా గట్టి మ్యాటరే ఉన్నట్టుంది. దేవిశ్రీ ప్రసాద్ ఆల్బమ్ ఇప్పటికే బాగా హిట్టయ్యింది. ప్రభుత్వాల నుంచి లాక్ డౌన్ కు సంబంధించి అన్ని క్లియరెన్సులు వచ్చాక ఉప్పెన రిలీజ్ డేట్ ఫైనల్ చేయబోతున్నారు. మొత్తానికి దర్శకుడు బుచ్చిబాబు మొదటి సినిమాతోనే పెద్ద అచీవ్ మెంట్ సాధించాడు. తమిళ్ వెర్షన్ బాధ్యతలు కూడా అతనికే ఇవ్వబోతున్నట్టు వినికిడి

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet