iDreamPost
android-app
ios-app

డార్లింగ్ జోరు అస్సలు తగ్గడం లేదు

  • Published Jul 24, 2021 | 10:32 AM Updated Updated Jul 24, 2021 | 10:32 AM
  • Published Jul 24, 2021 | 10:32 AMUpdated Jul 24, 2021 | 10:32 AM
డార్లింగ్ జోరు అస్సలు తగ్గడం లేదు

ఊహించని విధంగా ఇవాళ ప్రభాస్-నాగ అశ్విన్ షూటింగ్ లాంఛనంగా ప్రారంభించారు. దీని కోసమే బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు. మొదటి షాట్ ఆయన మీదే తీయగా క్లాప్ ప్రభాస్ కొట్టారు. గెటప్ గట్రా రివీల్ కాకుండా చాలా జాగ్రత్తగా బ్లర్ చేసి మేనేజ్ చేశారు. వర్కింగ్ టైటిల్ ప్రాజెక్ట్ కె గా ఫిక్స్ చేయడం ఆసక్తి రేపింది. అయితే ఇదే ఫైనల్ కాకపోవచ్చు. ఆల్రెడీ పేరుని దర్శకుడు నాగ అశ్విన్ లాక్ చేసుకున్నారని మొదటి అక్షరం కతోనే మొదలవుతుందని ఇన్ సైడ్ టాక్. అన్ని బాషలకు కామన్ గా ఉండేలా యునానిమస్ నేమ్ ని ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. ఇది ఇప్పట్లో బయటికి రాకపోవచ్చు.

ప్రభాస్ ప్రస్తుతం బ్యాలన్స్ ఉన్న రాధే శ్యామ్ ని వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇదయ్యాక సలార్ ముందా లేక ఆది పురుష్ ని కంటిన్యూ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. రెండు సినిమాల తాలూకు పనులు మాత్రం ఆయా డైరెక్టర్లు చేసేస్తున్నారు. రాధే శ్యామ్ ని ఈ ఏడాది విడుదల చేస్తారా లేదా అనే దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ 2022 అనుకుంటే మాత్రం సంక్రాంతి కంటే ఎక్కువ ఆలస్యం చేయడానికి లేదు. ఇంకా ప్రమోషన్లు కూడా మొదలుపెట్టలేదు కనక ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఏదున్నా సరే వచ్చే నెల లోపు ఒక నిర్ణయానికి రావాలి.

ఇక ప్రాజెక్ట్ కె విషయానికి వస్తే ఇదో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని ముందు నుంచి వినిపిస్తూనే ఉంది. కథను చాలా కీలకంగా నడిపించే సైంటిస్ట్ తరహా క్యారెక్టర్ లో అమితాబ్ ని ప్రెజెంట్ చేస్తారట. దీపికా పదుకునే పాత్ర కూడా రెగ్యులర్ గా ఉండదని తెలిసింది. షూట్ మాత్రం ఇంకో మూడు నాలుగు నెలల తర్వాత కొనసాగే అవకాశం ఉంది. అన్నట్టు ఆది పురుష టీమ్ ఎందుకో ఈ మధ్య సైలెంట్ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ లో బిజీ గా ఉందో లేక ముంబైలో పరిస్థితుల వల్ల తాత్కాలిక బ్రేక్ వేసుకుందో కానీ ముంబై మీడియా నుంచి కూడా ఎలాంటి న్యూస్ లు లేవు. మొత్తానికి ప్రభాస్ నాన్ స్టాప్ స్పీడ్ మాములుగా లేదు

Also Read: ఆ సంఘటన స్ఫూర్తితో రాధే శ్యామ్ ?

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişgrandpashabet