iDreamPost
android-app
ios-app

UP Election – యూపీలో పొత్తు పొడిస్తేనే నిలిచేది… గెలిచేది..

  • Published Nov 18, 2021 | 5:42 AM Updated Updated Nov 18, 2021 | 5:42 AM
UP Election – యూపీలో పొత్తు పొడిస్తేనే నిలిచేది… గెలిచేది..

‘రాజకీయాల్లో ఒకటి ప్లస్‌ ఒకటి ఎప్పుడూ రెండు కాదు’ అని నానుడి. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో పొత్తులు పెట్టుకున్నప్పు ఈ మాట వింటూనే ఉంటాము. ఒకటి ప్లస్‌ ఒకటి రెండు కాకున్నా.. ఒకటిన్నర అయినా చాలు ఎన్నికల ఫలితాలు తారుమారు కావడానికి అని చాలా పార్టీల నమ్మకం. అలాగే ఒకటి ప్లస్‌ ఒకటి మూడైన ఉదాంతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త కూటమి ఏర్పాటు బలంగా వినిపిస్తుంది. యోగి సారధ్యంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశముంది కాని.. మెజార్టీ గణనీయంగా తగ్గిపోతుందని.. ఇదే సమయంలో సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పీ) పుంజుకుంటుందనే ఏబీపీ ` సీ ఓటర్‌ సర్వే చెప్పడంతో పొత్తుల మీద మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇక్కడ ఎస్‌పీతోపాటు బహుజన్‌ సమాజ్‌వాది (బీఎస్పీ), కాంగ్రెస్‌ పార్టీ కలిసి పోటీ చేస్తే యూపీలో బీజేపీని ఓడిరచవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో జరిగే ఎన్నికలు ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్‌ ఒక్కరికే కాదు.. మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్‌ యాదవ్‌.. మాయావతి.. కాంగ్రెస్‌ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహూల్‌ గాంధీ, యూపీ బాధ్యతలు తలకెత్తుకున్న ప్రియాంకా గాంధీకి సైతం అగ్నిపరీక్షే. ఏబీపీ – సీ ఓటరు సర్వే ప్రకారం ఇక్కడ బీజేపీ సాధారణ మెజార్టీ కన్నా మరికొన్ని సీట్లు మాత్రమే సాధిస్తుందని, గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీ కన్నా 91 నుంచి 99 సీట్ల వరకు తగ్గుతాయని అంచనా వేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ 213 నుంచి 221 వరకు మాత్రమే సీట్లు వస్తాయని తేల్చింది. ఇదే సమయంలో గత ఎన్నికల్లో కేవలం 48 సీట్లుకు పరిమితమైన సమాజ్‌వాది ఈసారి తన సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోనుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ 152 నుంచి 160 సీట్లు వస్తాయని తేల్చింది. మరో ప్రధాన పార్టీ బీఎస్పీ 16 నుంచి 20 సీట్ల వరకు వస్తాయని సర్వే తేల్చింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ కేవలం 6 నుంచి పది స్థానాలకు పరిమితం కానుందని తేలింది. సర్వేను దృష్టిలో పెట్టుకుని ఎస్‌పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీ కలిసి పోటీ చేస్తే మంచిదని రాజకీయా విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా సీట్లపరంగా చూస్తే ఈ పొత్తు ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాని ఆయా పార్టీలకు వచ్చే ఓట్ల శాతం చూస్తే కొంత వరకు సానుకూలత ఉంది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 40.7 శాతం ఓట్లు రాగా, ఎస్‌పీకి 31.1, బీఎస్పీకి 15.1, కాంగ్రెస్‌ పార్టీకి 8.9 శాతం ఓట్లు వస్తాయని అంచనా. ఈ మూడు పార్టీలకు కలిపి 55.1 శాతం ఓట్లు సాధించే అవకాశముంది. రాజకీయాల్లో ఒకటికి ఒకటి కలిపితే రెండు కాదు అనే నానుడి ఉన్నా బీజేపీ కన్నా ఎక్కువ శాతం ఓట్లను ఈ కూటమి పొందడం ద్వారా అధికారంలోకి వచ్చే అవకాశముంది. పైగా బీజేపీ వ్యతిరేకంగా ఓట్లు చీలే అవకాశం లేనందున కూటమికి మేలు జరుగుతుంది. ఇదే సమయంలో బీజేపీని యూపీలో వ్యతిరేకించే ముస్లిం, యాదవ, దళిత ఓట్లలో చీలిక రాకుంటే కూటమి విజయావకాశలు మరింత మెరుగు పడతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీకి గత ఎన్నికలకన్నా ఓట్లు శాతం కూడా తగ్గుతుందని సర్వేలో తేలిన విషయం తెలిసిందే. పైగా సెప్టెంబరు కన్నా అక్టోబరులోను, అక్టోబరు కన్నా నవంబరులో బీజేపీకి ఆదరణ తగ్గుతుందని తేలింది.

ఇదే ప్రతిపక్షాలకు ఆశలు రేకెత్తిస్తుంది. గత ఎన్నికల్లో బీజేపీ, అప్నాదల్‌ కలిసి పోటీ చేయగా, సమాజ్‌వాది, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఎస్‌పీ, కాంగ్రెస్‌ పార్టీలు తిరిగి పొత్తు పెట్టుకుంటాయో లేదో తేలాల్సి ఉంది. ఈ కూటమిలో బీఎస్పీ చేరుతుందనేది కూడా సందిగ్ధమే. ఇటీవల కాలంలో బీజేపీకి బీఎస్పీ రహస్యమిత్రునిగా మారిపోయారనే అనే విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూడు పార్టీలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారిన నేపథ్యంలో బీజేపీని ఓడిరచేందుకు ఒక తాటిమీదకు రావాలని సెక్యులర్‌ వాదులు కోరుకుంటున్నారు. ఇది జరిగేది లేనిది త్వరలో తేలనుంది.

Also Read : Up Elections, CM Yogi – ఉత్తరప్రదేశ్ ఎన్నికలు .. యోగికి అగ్నిపరీక్షగా మారనున్నాయా..?