iDreamPost
iDreamPost
బాహుబలి ఎప్పుడైతే ఇంటర్ నేషనల్ లెవెల్ లో బ్లాక్ బస్టర్ అయ్యిందో అప్పటి నుంచి ప్రభాస్ మనవాళ్ళకు బొత్తిగా నల్లపూసైపోయాడు. సాహో డిజాస్టర్ అయినప్పటికీ క్రేజ్ విషయంలో డార్లింగ్ కు తిరుగు లేదు. కాకపోతే ప్రతి సినిమాకు రెండేళ్ళకు పైగా గ్యాప్ రావడమే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రాధే శ్యామ్(ప్రచారమవుతున్న టైటిల్) సైతం అదే తరహాలో అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకుడిగా రూపొందుతున్న ఈ క్రేజీ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. 2021 సమ్మర్ కంటే ముందు రిలీజయ్యే ఛాన్స్ అయితే లేదు. దీని తర్వాత వైజయంతి బ్యానర్ లో నాగ అశ్విన్ డైరెక్షన్ లో ఇంకో భారీ ప్రాజెక్ట్ ఒప్పుకున్న ప్రభాస్ దాని కోసం కనీసం మరో ఏడాదిన్నర ఖర్చు చేయక తప్పదు.
ఇదిలా ఉండగా వీటి గురించి క్లారిటీ లేకుండానే మన డార్లింగ్ ని బాలీవుడ్ లోకి లాగే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని ముంబై టాక్. నాగ అశ్విన్ సినిమా పూర్తయ్యాక డైరెక్ట్ హిందీ డెబ్యూకి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఇది లాక్ డౌన్ కు చాలా రోజుల ముందు నుంచే జరుగుతున్న తతంగమట. దర్శకుడికి సంబంధించిన క్లూ కూడా బయటికి వచ్చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో తానాజీ రూపంలో అజయ్ దేవగన్ కు భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఓం రౌత్ దీనికి డైరెక్టర్ గా వ్యవహరించే అవకాశం ఉందట. నిర్మాణ భాగస్వామిగా యువితో పాటు మరో ప్రొడక్షన్ హౌస్ చేతులు కలపొచ్చని వినికిడి.
సోలోగా మన నిర్మాతలు నేరుగా అక్కడ విడుదల చేసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి టై అప్ తప్పనిసరి. సాహో, సైరాలకు ఇదే ఫాలో అయ్యారు. కాకపోతే ప్రభాస్ ను అక్కడ లాంచ్ చేయాలనీ తెగ ట్రై చేస్తున్న కరణ్ జోహారా లేక మరొకరా అనేది తేలాల్సి ఉంది. ఎలాగూ బై లింగ్వల్ తీస్తారు కాబట్టి తెలుగులోనూ స్ట్రెయిట్ గానే ఉంటుంది. కాకపోతే ఫాంటసీ జానర్ లో ఉంటుందా లేక ఏదైనా కమర్షియల్ సబ్జెక్టు ప్లాన్ చేస్తారా అనేది తెలియడానికి చాలా టైం పడుతుంది. ప్రస్తుతానికి ఇదంతా ప్రాధమికంగా అందుతున్న సమాచారమే తప్ప అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. సో ప్రభాస్ వచ్చే మూడు నాలుగేళ్లలో ఈ మూడు పూర్తి చేయడమే టార్గెట్ గా పెట్టుకోవచ్చు