iDreamPost
android-app
ios-app

Jr NTR : యంగ్ టైగర్ కు అనుకోని విరామం

  • Published Nov 08, 2021 | 6:20 AM Updated Updated Nov 08, 2021 | 6:20 AM
Jr NTR : యంగ్ టైగర్ కు అనుకోని విరామం

ఏంటో ఈ మధ్య స్టార్ హీరోలు వర్కౌట్ చేసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలకు గురవుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ ఏకంగా ప్రాణాలే కోల్పోవడం ఇంకా కళ్ళముందే ఉంది. అందుకే వైద్యులు ఫిట్ నెస్ పేరుతో మితిమీరిన వ్యాయాయం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఇక విషయానికి వస్తే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేతికి ఇటీవలే చిన్న సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ముందు గుట్టుగా దాచారు కానీ తర్వాత దీపావళి సందర్భంగా తన ఇద్దరుకొడుకులతో తారక్ ఫోటో పోస్ట్ చేసినప్పుడు ఈ నిజం బయట పడింది. చిరంజీవికి సైతం ఇదే తరహాలో ఆపరేషన్ జరిగి విశ్రాంతి తీసుకుని కోలుకున్న సంగతి తెలిసిందే.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ కు కనీసం రెండు నెలల రెస్ట్ అవసరమని డాక్టర్లు చెప్పారట. దీనికన్నా ముందు కొరటాల శివ దర్శకత్వంలో తారక్ చేయబోయే 30వ సినిమా త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పాత్ర కోసమే జూనియర్ బరువులో తగ్గే పనిలో పడ్డాడు. ఆర్ఆర్ఆర్ లో స్వతంత్ర సమరయోధుడి క్యారెక్టర్ కోసం శరీరాన్ని కష్టపెట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల సినిమా కోసం పూర్తిగా మారాల్సిన అవసరం వచ్చేసింది. తీరా చూస్తే ఇలా అయ్యింది. రెండు నెలలు రెస్ట్ అనుకున్నా కూడా ఫిబ్రవరి కంటే ముందు షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. ఇది ఫ్యాన్స్ కి నిరాశ కలిగించేదే

ఇదంతా ఒకే కానీ రాబోయే నెలన్నర రోజులు భీభత్సంగా ప్లాన్ చేసిన ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో తారక్ పాల్గొంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. బాలయ్య చేస్తున్న ఆన్ స్టాపబుల్ టాక్ షోలో జూనియర్ ఓ ఎపిసోడ్ చేశాడనే టాక్ వచ్చింది కానీ మరి దాన్ని షూట్ చేశారా లేదా ఇంకా తెలియాల్సి ఉంది. అరవింద సమేత వీర రాఘవ తర్వాత మూడేళ్ళకు పైగా వెండితెర దర్శనం లేక అభిమానులకు దూరమైన తారక్ ఇటీవలే చేసిన ఎవరు మీలో కోటీశ్వరుడు షోతో బాగానే మెప్పించాడు. రికార్డు బ్రేకింగ్ రేటింగ్స్ రాలేదు కానీ పోటీగా నిలిచిన బిగ్ బాస్ 5 కంటే బెటర్ అనే అభిప్రాయాన్ని కలిగించింది. సెకండ్ సీజన్ గురించి ఇంకా క్లారిటీ లేదు

Also Read : Pushpa : పరుగులు పెడుతున్న పుష్ప – టార్గెట్ చేరుకునేనా

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alKulisbetKulisbetberlinbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş