Pushpa : పరుగులు పెడుతున్న పుష్ప - టార్గెట్ చేరుకునేనా

By iDream Post Nov. 08, 2021, 12:30 pm IST
Pushpa : పరుగులు పెడుతున్న పుష్ప - టార్గెట్ చేరుకునేనా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియాని టార్గెట్ చేసుకుని తీసిన పుష్ప సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ గా సాగుతోంది. డిసెంబర్ 17 విడుదలలో ఎలాంటి మార్పు ఉండదనే రీతిలోనే సంకేతాలు ఇస్తున్నారు. చేతిలో సరిగ్గా 40 రోజుల సమయం మాత్రమే ఉంది. చిత్రీకరణ పూర్తయిన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నారు కానీ ఇంకా చేయాల్సిన వర్క్ చాలానే ఉందని ఇన్ సైడ్ టాక్. దీని కోసమే దర్శకుడు సుకుమార్ ఒకపక్క ఎడిటింగ్ వ్యవహారాలతో పాటు రెండు యూనిట్లతో మిగిలిన పనులన్నీ చూసుకుంటున్నారట. ఎలాగైనా సరే చెప్పిన తేదీని మీట్ కావాలనే లక్ష్యంతో పుష్ప టీమ్ ఉరుకులు పరుగులు పెడుతోంది. టైం తక్కువగా ఉంది మరి.

అనుకోకుండా వచ్చిన ఇబ్బందులు కూడా పుష్పని రిస్క్ లో పెడుతున్నాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్ ని థియేటర్లలో విడుదల చేసే విషయంలో అక్కడి నిర్మాత పెడుతున్న పేచీ తలనెప్పిని తెచ్చి పెట్టింది. ఇప్పటిదాకా పుష్పకు సంబంధించి మూడు లిరికల్ వీడియోస్ రిలీజ్ అయ్యాయి. ఏదీ రంగస్థలంని మించి ఉంది అనిపించుకోలేదు. అందుకే మిగిలినవి ఇంకా బాగుంటాయనే హింట్ ని ఇటీవలే బన్నీ వేరే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పడం గమనార్హం. ఇప్పుడు సుక్కు తలమీద ప్రీ రిలీజ్ ఈవెంట్ తాలూకు బరువు కూడా ఉంది. విదేశాల్లో చేయాలనే ప్రతిపాదనని మైత్రి అధినేతలు సీరియస్ గా పరిశీలిస్తున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే డిసెంబర్ 17 న రాబోతున్న స్పైడర్ మ్యాన్ కొత్త సినిమాతో నేషనల్ వైడ్ కలెక్షన్ల మీద ప్రభావం చూపించేలా ఉంది. వారం గ్యాప్ లో శ్యామ్ సింగ రాయ్, 83లు వస్తున్నాయి. వీటి ధాటిని తట్టుకుని అయిదు భాషల్లో పుష్ప సత్తా చూపించాలంటే మాటలు కాదు. అందులోనూ ఇది బాహుబలి లాగా ఫాంటసీ మూవీ కాదు. సౌత్ ఆర్టిస్టులతో చేసిన కమర్షియల్ డ్రామా. అందుకే జాగ్రత్తగా ఉండాలి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న పుష్పలో ఇప్పటికే సునీల్, ఫహద్ ఫాసిల్ లుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కట్ కూడా జరుగుతోందట. అది బయటికి వస్తే అప్పుడు హైప్ ఇంకో లెవెల్ కి వెళ్తుంది

Also Read : Mega Star And Power Star : మోస్ట్ వెయిటెడ్ కాంబినేషన్ రాబోతోందా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp