iDreamPost
android-app
ios-app

డిజాస్టర్ టాక్ తో మతిపోయే రికార్డులు

  • Published Nov 11, 2020 | 8:01 AM Updated Updated Nov 11, 2020 | 8:01 AM
డిజాస్టర్ టాక్ తో మతిపోయే రికార్డులు

మొన్న డిస్నీ హాట్ స్టార్ ద్వారా విడుదలైన అక్షయ్ కుమార్ లక్ష్మి యునానిమస్ గా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్ లో దీని మీద విమర్శలు వచ్చాయి. 2011లో వచ్చిన కాంచన రీమేక్ గా లారెన్స్ రాఘవేంద్ర దర్శకత్వంలో రూపొందిన లక్ష్మి కనీసం అభిమానులను సైతం సంతృప్తి పరచలేకపోయింది. బాలీవుడ్ మీడియా ఏకంగా ఒకటి రెండు రేటింగ్ తో చెడుగుడు ఆడేసింది. ఇదే సినిమా థియేటర్లలో వచ్చి ఉంటే అక్కికి వసూళ్ల పరంగా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచి ఉండేదన్న కామెంట్స్ లో నిజం లేకపోలేదు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.

రిపోర్ట్స్ ఎలా ఉన్నా మొదటిరోజు మాత్రం లక్ష్మి వ్యూస్ పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. కేవలం 24 గంటల్లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్టు సమాచారం. ఇప్పటిదాకా ఈ విషయంలో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆఖరి చిత్రం దిల్ బేచారా ముందంజలో ఉంది. దానికి ఒక్క రోజులో 98 మిలియన్ల దాకా వ్యూస్ వచ్చాయి. అయితే లక్ష్మి ఏకంగా డబుల్ మార్జిన్ తో దాన్ని దాటేసింది. హాట్ స్టార్ విఐపికి చందా తక్కువగా ఉండటంతో పాటు ఇటీవల ఐపీఎల్ ను టెలికాస్ట్ చేయడం, హోమ్ మల్టీ ప్లెక్స్ కాన్సెప్ట్ తో కొత్త డైరెక్ట్ రిలీజులను ప్రకటించడం భారీగా చందాదారులను తీసుకొచ్చింది.

ఈ కారణాల వల్ల లక్ష్మిని ప్రేక్షకులు విపరీతంగా చూశారు. పైసా అదనంగా ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లోనే చూసే వెసులుబాటు కావడంతో ఇన్నేసి వీక్షణలు వచ్చి పడ్డాయి. లక్ష్మి మీద సుమారు వంద కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన హాట్ స్టార్ కు రిజల్ట్ నిరాశ కలిగించినా ఈ రకంగా వచ్చిన స్పందన సంతోషంలో ముంచెత్తుతోంది. ఒకవేళ ఇదే చిత్రం హాళ్లలో వచ్చి ఉంటే నిర్మాతకు ఏ రేంజ్ లో షాక్ ఇచ్చేదో మరి. కంటెంట్ ఎలా ఉన్నా అక్షయ్, శరద్ ల యాక్టింగ్ మాత్రం ప్రశంసలు దక్కించుకుంటోంది. ఇదే ఊపులో త్వరలో అభిషేక్ బచ్చన్ బిగ్ బుల్, అజయ్ దేవగన్ భుజ్ లను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది హాట్ స్టార్