iDreamPost
android-app
ios-app

కూలిన ఉక్రెయిన్ విమానం – 22 మంది దుర్మరణం

కూలిన ఉక్రెయిన్ విమానం – 22 మంది దుర్మరణం

ఉక్రేనియన్ వైమానిక దళానికి చెందిన విమానం కూలిపోవడంతో 20 మంది మిలిటరీ క్యాడెట్లతో సహా 22 మంది మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.

వివరాల్లోకి వెళితే ఉక్రెయిన్ దేశానికి తూర్పున ఉన్న  ఖార్కివ్ ప్రాంతంలో చుహుయివ్ మిలిటరీ వైమానిక స్థావరం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో స్థానిక సమయం రాత్రి 8.50 గంటలకు ఆంటోనోవ్ అన్ -26 విమానం కూలిపోయిందని అధికారులు ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 27 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 20 మంది మిలిటరీ క్యాడెట్లు కాగా మిగిలిన ఏడుగురు వైమానిక సిబ్బందిగా అధికారులు తెలిపారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విమానం కూలిపోయిన తర్వాత దగ్ధం అవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెన్స్కీ ఈ ప్రమాదాన్ని “భయంకరమైన విషాదం” గా అభివర్ణించారు ప్రమాదం జరిగిన చోటుకు నేడు వెళ్లనున్నట్లు తెలిపారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను పరిశోధించడానికి ఒక కమిషన్‌ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.