iDreamPost
android-app
ios-app

కర్ణాటక క్యాబినెట్ లో అసమ్మతి రాగం

కర్ణాటక క్యాబినెట్ లో అసమ్మతి రాగం

కర్నాటకలో బీజేపీ ఏం ఆశించి యడ్యూరప్పను తొలగించి బసవరాజు బొమ్మైని గద్దెనెక్కించారో తెలియదు కానీ బొమ్మై ప్రభుత్వం అప్పుడే అసంతృప్తి సెగలు ఎదుర్కొంటుంది. ఏజ్ కటప్ తోనే యడ్డిని తప్పించామని చెప్తున్నా బీజేపీ వచ్చే ఎన్నికల మీద ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. బసవరాజు బొమ్మై ప్రభుత్వం ఏర్పడి రెండు వారాలు కాలేదు అప్పుడే అసమ్మతి రాగాలు మొదలయ్యాయి.ఇద్దరు మంత్రులు తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బొమ్మై క్యాబినెట్ లో యెడ్డీ కుమారునికి మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో పాటు యడ్యూరప్పకు క్యాబినెట్ హోదాను కల్పిస్తూ బొమ్మై సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా తిరస్కరించడంతో అసంతృప్తి మెల్లిగా బయటపడుతున్నట్లు కనిపిస్తోంది.

తాజగా ఇద్దరు మంత్రులు తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తిగా ఉన్నారు. టూరిజం, ఎకాలజీ, పర్యావరణ శాఖమంత్రి ఆనంద్ సింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌, చక్కెర శాఖ మంత్రి MTB నాగరాజు తమ కేటాయించిన శాఖలపై గుర్రుగా ఉన్నారు.2019లో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంలో ఈ ఇద్దరు నేతలు కీలకంగా వ్యవహరించారు. తనకు ఈ శాఖలు కేటాయించమని సీఎం బసవరాజు బొమ్మైని కొరలేదని ఆనంద్ సింగ్ సన్నిహితులతో చెప్తున్నట్లు సమాచారం. మరోసారి సీఎం బొమ్మైని కలిసి చర్చిస్తానని, బహిరంగంగా మంత్రిపదవిపై కామెంట్లు చేయనని తెలిపారు.

ఇద్దరు మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో సీఎం బొమ్మై దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. జులై 28న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తరువాత మంత్రివర్గ కూర్పు సమయంలో ఆనంద్ సింగ్ తో చర్చించానని ముఖ్యమంత్రి బసరాజు బొమ్మై ప్రకటించారు. మరో మంత్రి నాగరాజుతో కూడా చర్చిస్తానని తెలిపారు.

కానీ ఇప్పుడు మంత్రులు అసమ్మతి రాగం వ్యక్తం చేయడం వెనుక యడ్యూరప్ప ఉన్నారా అని బీజేపీ అరా తీస్తోంది. మంత్రులు అసమ్మతి వ్యక్తం చేస్తున్న యెడ్డీ అనుచరుడే ముఖ్యమంత్రి కావడంతో అంత సైలెంట్ గా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్పకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ బొమ్మై ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను యెడ్డీ తిరస్కరించారు. తనకు మాజీ ముఖ్యమంత్రికి కల్పించే సౌకర్యాలు మాత్రమే కల్పించాలని మాత్రమే కోరారు. కర్ణాటక కొత్త ప్రభుత్వంలోని అసమ్మతి రాగాలపై బీజేపీ అధినాయకత్వం ఆచితూచి స్పందిస్తోంది. కొత్త ప్రభుత్వం సెట్ కావడానికి సమయం పడుతుందని అప్పటివరకు ఇలాంటివి సహజం అని మాట్లాడుతున్నా అసమ్మతి నేతల కదలికలపై హైకమాండ్ దృష్టిపెట్టింది.

కన్నడ బీజేపీ రాజకీయంలో యడ్యూరప్పది కీలకపాత్ర. కానీ తనను తప్పించడంతో యెడ్డీ అసమ్మతి వ్యక్తం చేస్తున్నారా. యెడ్డీ అసమ్మతితో బొమ్మై సర్కార్ పూర్తి స్థాయిలో మనగలుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకా పూర్తిగా సెట్ కానీ బొమ్మై సర్కార్ అసమ్మతి నేతలను బుజ్జగించి ప్రభుత్వంపై పట్టు సాధిస్తుందో లేదో వేచి చూడాలి.

Also Read : స‌చిన్ పైల‌ట్ పార్టీ మార్పు? ఆ బీజేపీ నేత వ్యాఖ్య‌ల్లో నిజం ఎంత‌?