iDreamPost
android-app
ios-app

నిర్వహణ భారమైన శ్రీవారి ఆస్తులు వేలం

నిర్వహణ భారమైన శ్రీవారి ఆస్తులు వేలం

నిర్వహణ భారమైన తిరుమల శ్రీవారి ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి నిర్ణయించింది. తమిళనాడు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పొలాలు, ఇళ్ల స్థలాలను వేలం వేసేందుకు ఆయా ఆస్తుల వివరాలు, వాటి విలువతో ఏప్రిల్‌ 30వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. శ్రీవారి ఆస్తులు వేలం వేయాలని ఫిబ్రవరి 29వ తేదీన జరిగిన పాలక మండలి సమావేశంలో నిర్ణయించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 25 చిన్నా, చితకా ఆస్తులు వేలం వేయనున్నారు. ఈ ఆస్తులన్నీ భక్తులు శ్రీవారికి కానుకలుగా ఇచ్చినవి.