ఆర్టీసీ కార్మిక సంఘాలు బుధవారం తలపెట్టిన సకల జనుల సభకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సరూర్ నగర్ లో తపపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించడం తో కార్మిక జేఏసీ అత్యవసరంగా మంగళవారం మధ్యాహన్నం హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. సరూర్ నగర్ లో రేపు మధ్యాహన్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహిస్తామని కార్మిక జేఏసీ కోర్టు కి తెలిపింది. పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొంది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. సభ ఎక్కడైతే అనుమతి ఇస్తారో సాయంత్రం 4 గంటలకు తెలపాలని ఆదేశించింది.