Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లోని బీసీ కులాలు సంతోషంతో మునిగితేలుతున్నాయి. ఆర్థికంగా చేయందించే నాయకుడి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ప్రజలకు జగనన్న రూపంలో సరైన అండ దొరకడంతో వారి ఆనందానికి హద్దు ల్లేవ్. కొద్ది రోజులుగా ఆయా కుటుంబాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా ఏపీలోని బీసీ ప్రభావిత జిల్లాలో ఇది మరింత ఉత్సాహాన్నినింపింది. ధ్దేశచరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లను ఒకేసారి ఏర్పాటు చేయడాన్ని పురస్కరించుకుని జరుగుతున్న కార్యక్రమాల్లో అందరూ సమష్టిగా ఉత్సవాలు జరుపుకోవడం ప్రత్యేకంగా కనిపిస్తోంది.
వెన్నెముకలాంటి వర్గాలు
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్పొరేషన్ల ఏర్పాటు చేయడమే బీసీల ఈ పండుగకు కారణం. అత్యధికంగా 56 కార్పొరేషన్ల ఏర్పాటు, అందులోనూ సగంమంది మహిళా నేతలకు అవకాశం కల్పించడం ఒక విప్లవాత్మకమైన చర్య అని నిపుణులు పేర్కొంటున్నారు. వట్టి మాటలే కాదు చేతల్లో కూడా.. ‘బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు, వెన్నెముకలాంటి వర్గాలు’ అని ముఖ్యమంత్రి సాహసోపేతంగా చేసి చూపించారని పేర్కొన్నారు. ఇది నిజమైన బీసీల ప్రభుత్వమని వెల్లడించే రీతిలో 139 కులాలకు ప్రాధాన్యత కల్పించారని తెలిపారు.
రూ.33,500 కోట్లు ఖర్చు..
తాజాగా బీసీ కార్పొరేషన్ల ఏర్పాటే కాదు.. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ బీసీలకు అన్నింటా ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది. ఇప్పటికే బీసీ సంక్షేమం కోసం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా ప్రభుత్వం కేవలం 16 నెలల్లోనే పలు పథకాల ద్వారా 2,71,37,253 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.33,500 కోట్లు ఖర్చు చేసింది. ఈ క్రమంలో 56 కార్పొరేషన్లను ప్రకటించడాన్ని పురస్కరించుకుని ఈనెల 20 వరకు పర్వదినాలుగా బీసీలు జరుపుకోవడానికి అదే కారణం.
ఇప్పుడేం రాజకీయాలు చేస్తారో..!
ఆంధ్రప్రదేశ్ లో ఉనికి కోసం పాకులాడుతున్న తెలుగుదేశం పార్టీ అందుకు దేన్నైనా రాజకీయం చేసేందుకు వెనుకాడడం లేదు. ఇటీవల కాలంలో ఆ పార్టీ అనుసరిస్తున్న తీరును చూస్తే అది స్పష్టం అవుతుంది. చివరకు కాషాయికరణం చెందడానికి కూడా వెనుకాడ లేదు. దీనికి తోడు గత నెలలో తిరుమలలో డిక్లరేషన్ అంశాన్ని పెద్ద వివాదాస్పదంగా మార్చింది. అంతటితో ఆగకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడాన్ని కూడా రాజకీయం చేశారు. ప్రజలలో మూఢ నమ్మకాన్ని, భయాన్ని కలిగించేలా వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేక సమావేశం పెట్టి మరీ..
గత నెలలో జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా జూమ్ మీటింగ్ పెట్టి మరీ స్థానిక నేతలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆగమేఘాల మీద చిత్తూరు జిల్లా టిడిపి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ఒకటి పెట్టారు.ఇందులో ఆయన మాట్లాడుతూ జగన్ తప్పనిసరిగా తిరుమల ఆలయంలోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఇవ్వాలని సూచించారు.డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారి ఆలయంలోకి అడుగు పెట్టాలని అన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే బ్రహ్మోత్సవాల వేళ స్వామి వారికి పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి ఒక్కరే కాకుండా సతీ సమేతంగా ఇవ్వాలని బాబు మెలికపెట్టారు.బ్రహ్మోత్సవాల్లో ఒంటరిగా పట్టువస్త్రాలు ఇస్తే జగన్ తో పాటు.. రాష్ట్రానికి కూడా అరిష్టమంటూ జనాన్ని భయాందోళనకు గురి చేసే రాజకీయాలు ప్రారంభించారు. డిక్లరేషన్ ఇష్యూతో పాటు స్వామివారికి పట్టువస్త్రాల్ని సమర్పించే విషయంలో దంపతులు ఇద్దరు ఉండాలన్న సంప్రదాయాన్ని బాబు గుర్తు చేయడం ద్వారా మరో వివాదాన్ని రేపే ప్రయత్నం చేశారు.
దీన్ని కూడా రాజకీయం చేస్తారా..?
దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గమ్మని దర్శించుకోనున్నారు సీఎం జగన్. ఈ నెల 21 మూల నక్షత్రం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అమ్మవారికి పట్టు వస్త్తాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3:30గంటలకు ఇంటి నుంచి బయలుదేరి 3:40గంటలకు దుర్గగుడికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం 4 గంటలకు తిరిగి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. గత నెలలో టీడీపీ చేసిన రాజకీయాల నేపథ్యంలో ఇప్పుడు దీన్ని కూడా వివాదాస్పదంగా మార్చే ప్రయత్నం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రాజకీయాలకు కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రస్తుతం టీడీపీ తీరు ఉండడమే ఈ తరహా ప్రచారాలకు కారణం అవుతోంది. ఇప్పటి వరకూ అయితే దీనికి సంబంధించి ఏ విధమైన వ్యాఖ్యలు చేసినట్లు కనిపించ లేదు. మరి ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి.