iDreamPost
android-app
ios-app

ఆదివారం కూడా విధుల్లో ట్రెజరీ ఉద్యోగులు.. జీతాలు క్లియర్ చేయడంలో బిజీబిజీ!

ఆదివారం కూడా విధుల్లో ట్రెజరీ ఉద్యోగులు.. జీతాలు క్లియర్ చేయడంలో బిజీబిజీ!

ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఉద్యోగులు ఆదివారం నాడు కూడా విధులకు హాజరయ్యారు. నిజానికి ట్రెజరీ ఉద్యోగులకు శనివారం ప్రభుత్వం మెమోలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆర్థికశాఖ, ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు హాజరైన ఉద్యోగులు ఆదివారం కూడా పని చేస్తున్నారు. పీఆర్సీ జీవోలు రద్దు సాధ్యంకాదని స్పష్టం చేసిన ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేస్తామని చెబుతోంది. అయితే శనివారం సాయంత్రం వరకు జీతాలు ప్రాసెసింగ్ చేయకుండా ఉండడంతో ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేసి, చర్యలకు ఆదేశించింది.

తక్షణమే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్‌ చేయాలని, బిల్లులు ప్రాసెస్‌ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని మెమోలలో జారీ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తప్పవని, బిల్లులు ప్రాసెస్‌ చేయని డీడీవోలు, ట్రెజరీ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఒక వేళ ట్రెజరీ సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇక ప్రధమ ప్రాధాన్యతగా జడ్జిలు, పోలీస్, మున్సిపాలిటీ శాఖలకు సంబంధించిన 11వ పీఆర్సీ జీతాలు అప్ లోడ్ చేస్తున్నారు ట్రెజరీ ఉద్యోగులు. అయితే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే వరకు కేవలం 1.10 లక్షల బిల్లులు మాత్రమే ప్రాసెస్ అయినట్లు చెబుతున్నారు. మొత్తం 4.50 లక్షల బిల్లులు పాస్ చేస్తేనే ఉద్యోగులందరికీ జీతాలు ఖాతాలలో పడతాయి. ఈ క్రమంలో సీరియస్ అయిన ప్రభుత్వం ఉత్తర్వుల్లో జారీ చేయడంతో ఆదివారం కూడా పని చేస్తూ జీతాలు క్లియర్ చేసే పనిలో పడ్డారు.