iDreamPost
android-app
ios-app

కేటీఆర్ డైనమిక్ లీడర్ – కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి ఊహించని ప్రశంస

  • Published Jun 29, 2020 | 2:57 PM Updated Updated Jun 29, 2020 | 2:57 PM
కేటీఆర్ డైనమిక్ లీడర్ – కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి ఊహించని ప్రశంస

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. హుజూర్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రశంశల వర్షం కురిపించుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదేళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమ్ కు కేటీఆర్ అభినందనలు తెలపగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రతిస్పందిస్తూ కేటీఆర్ డైనమిక్ లీడర్ అంటూ కితాబునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడిగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎప్పుడు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించుకునే ఇరు పార్టీ ప్రధాన నేతలు ఇలా ఒకే కార్యక్రమంలో కలుసుకుని ఒకరిపై ఒకరు ప్రశంసలజల్లు కురిపియడంతో, గతంలో ఇదే ఉత్తం కుమార్ రెడ్డి కేటీఅర్ ని ఫెయిల్డ్ మినిస్టర్, రాజకీయాల్లో బచ్చా అంటూ తీవ్ర వాఖ్యలు చేసిన సంఘటనలు గుర్తు తెచ్చుకుని అక్కడున్న వారంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Girişiptv satın al