అదేంటీ, ఓటీటీ తప్ప వేరే దిక్కులేదనే చర్చ ఓ పక్క టాలీవుడ్‌లో జరుగుతోంటే, ఓటీటీని చూసి బెదిరిపోవడమేంటి.? అవును, ఓటీటీ దెబ్బకి భయపడుతోంది టాలీవుడ్. ఎందుకంటే, ఓటీటీలో విడుదలైన ఒక్క సినిమా కూడా ఇప్పటిదాకా ‘హిట్’ అనిపించుకోలేదు. ఫర్వాలేదనుకున్న సినిమాలకి పెద్దగా ప్రచారం వుండడంలేదు. ‘ఉచితంగా చూసే అవకాశం’తో సినిమా మజా పోయింది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీ తప్ప ఇంకో దారి కనిపించడంలేదన్న వాదన కూడా వుంది. ‘కొన్నాళ్ళు ఆగి సినిమాని ది¸యేటర్లలో విడుదల చేసుకోవడమే మంచిది..’ అని ఓటీటీలో తన సినిమాని ఎలాగోలా విడుదల చేసేద్దామనుకున్న ఓ నిర్మాత ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గాడట. మరికొందరిదీ ఇదే పరిస్థితి అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు, సినీ ప్రముఖులతో ది¸యేటర్లను తెరవడంపై సమావేశం నిర్వహించబోతున్నారు ఆన్‌లైన్ ద్వారా. ఆ తర్వాత ది¸యేటర్లను తెరవడంపై ఓ స్పష్టత వస్తుంది. మెట్రో రైళ్ళు నేటి నుంచి అందుబాటులోకి రావడంతో, సినిమా ది¸యేటర్లను తెరవడం కూడా త్వరలోనే జరగొచ్చు. అదే జరిగితే, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ తప్పక సినీ అభిమానులకు లభిస్తుంది. మొదట్లో కష్టంగానే వుండొచ్చు.. కానీ, క్రమక్రమంగా సినిమా ది¸యేటర్లకు వెళ్ళే జనం పెరిగి, సినిమా పరిశ్రమకు ఊపు వస్తుందని ఆశిస్తున్నారు సినీ ప్రముఖులు. అక్టోబర్ చివరి నాటికి ది¸యేటర్లలో కొంతమేర సినీ సందడి కనిపించవచ్చునన్నది సినీ ప్రముఖుల అంచనా. ఈలోగా చిన్నా చితకా సినిమాలేవైనా ఓటీటీ కోసం తొందరపడితే పడొచ్చుగాక. ‘వి’ రిలీజ్ తర్వాత అంతలా ఓటీటీపై అంచనాలు నీరుగారిపోయాయ్ మరి.